ఏపీ పోలీసులకు జాతీయ స్థాయిలో మరోసారి అవార్డుల పంట
- గవర్నెన్స్ నౌ అవార్డులు
- పలు విభాగాల్లో అవార్డుల మోత మోగించిన ఏపీ పోలీసులు
- అభినందించిన డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి
- అవార్డులతో మరింత బాధ్యత పెరిగిందని వెల్లడి
గత కొంతకాలంగా ఏపీ పోలీసులు జాతీయస్థాయిలో గుర్తింపు పొందుతున్నారు. ఇప్పటికే అనేక జాతీయ అవార్డులు సొంతం చేసుకున్న ఏపీ పోలీసులకు మరోసారి పురస్కారాల పంట పండింది. గవర్నెన్స్ నౌ 2వ ఇండియా పోలీస్ అవార్డ్స్ లో ఏపీ పోలీసులకు పెద్ద సంఖ్యలో అవార్డులు లభించాయి.
కమ్యూనిటీ పోలీసింగ్, ఉమెన్ సేఫ్టీ, ఇ-పోలీసింగ్ పథకం, రోడ్ సేఫ్టీ మరియ ట్రాఫిక్ మేనేజ్ మెంట్, నిఘా మరియు పర్యవేక్షణ, నేరాల గుర్తింపులో సాంకేతిక పరిజ్ఞానం వినియోగం, పోలీసింగ్ ఇనిషియేటివ్-టెక్నాలజీ, కమాండ్ అండ్ కంట్రోల్, నేర విచారణ మరియు ప్రాసిక్యూషన్, పోలీసు విభాగంలో ఆధునికత, విపత్తు నిర్వహణ అంశాల్లో అవార్డులు లభించాయి.
పోలీస్ ప్రధాన కార్యాలయానికి 4 అవార్డులు, ఎన్టీఆర్ జిల్లా, తిరుపతి జిల్లా, శ్రీకాకుళం, విశాఖ, కాకినాడ, ప్రకాశం, కడప, చిత్తూరు జిల్లాల పోలీసు విభాగాలకు ఒక్కో అవార్డు దక్కాయి. దాంతో ఏపీ పోలీసులు ఇప్పటిదాకా అందుకున్న అవార్డుల సంఖ్య 189కి పెరిగింది. ఈ నేపథ్యంలో, రాష్ట్ర పోలీసులను డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి అభినందించారు. ప్రజలకు మెరుగైన సేవలు అందించే దిశగా ఈ అవార్డులతో మరింత బాధ్యత పెరిగిందని పేర్కొన్నారు.