మాజీ మంత్రి శంకరనారాయణకు నిరసన సెగ... ప్రజా సమస్యలు వినే ఓపిక లేదా? అని మహిళ నిలదీత
- శెట్టిపల్లిలో గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమం
- శంకరనారాయణకు సమస్యలు చెప్పిన మహిళలు
- జనం మాట పూర్తి కాకుండానే ముందుకు సాగిన మాజీ మంత్రి
ఏపీలో అధికార పార్టీకి చెందిన పెనుకొండ ఎమ్మెల్యే, మాజీ మంత్రి మాలగుండ్ల శంకరనారాయణకు శనివారం నిరసన సెగ తగిలింది. పార్టీ పిలుపు మేరకు ఆయా నియోజకవర్గాల పరిధిలో 'గడప గడపకు మన ప్రభుత్వం' పేరిట ఎమ్మెల్యేలు ప్రజల వద్దకు వెళుతున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా శనివారం శ్రీసత్యసాయి జిల్లా పెనుకొండ మండలం శెట్టిపల్లి, శెట్టిపల్లి తండాల్లో శంకరనారాయణ పర్యటించారు. ఈ సందర్భంగా ఆయనకు సమస్యలు వెల్లువెత్తాయి.
ఈ సందర్భంగా శెట్టిపల్లిలో తన ఇంటి ముందుకు వచ్చిన శంకరనారాయణను లలితా బాయి అనే మహిళ తన పెన్షన్ నిలిచిపోయిన వైనంపై నిలదీసింది. 11 నెలలుగా తన పింఛన్‌ను నిలిపివేశారన్న ఆమె.. ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేసింది. తనకు ఇల్లు మంజూరు చేయాలంటూ పద్మా బాయి అనే మహిళ ఎమ్మెల్యేను కోరింది. ఈ క్రమంలో జనం సమస్యలు చెబుతున్నా... శంకరనారాయణ అలా ముందుకు సాగిపోగా.. ప్రజా సమస్యలు వినే ఓపిక కూడా లేదా? అంటూ ఓ మహిళ తీవ్ర స్వరంతో ఆయనపై విరుచుకుపడింది.