బోనాల జాతర నేపథ్యంలో ఈ నెల 17, 18 తేదీల్లో హైదరాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్షలు
- ఆదివారం తెల్లవారుజాము నుంచి సోమవారం జాతర ముగిసేదాకా ఆంక్షలు
- పూజల వేళ ఆలయ సమీపంలోని పలు రోడ్లు మూత
- హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ ప్రకటన
సికింద్రాబాద్ ఉజ్జయినీ మహంకాళి బోనాల జాతర నేపథ్యంలో ఈ నెల 17, 18 తేదీల్లో సికింద్రాబాద్ పరిధిలోని పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలను విధిస్తున్నట్లు హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ ప్రకటించారు. ఈ సందర్భంగా ఆలయ సమీపంలోని పలు రోడ్లను మూసివేయనున్నట్లు ఆయన తెలిపారు. అంతేకాకుండా పలు రోడ్లలో ట్రాఫిక్‌ను దారి మళ్లిస్తున్నట్లు కమిషనర్ తెలిపారు.
కమిషనర్ ఉత్తర్వుల ప్రకారం.. సికింద్రాబాద్ పరిధిలోని కర్బాల మైదానం, రాణిగంజ్, ఓల్డ్ రామ్‌గోపాల్‌పేట పీఎస్, ప్యారడైజ్, ఎస్బీఐ క్రాస్ రోడ్స్, వైఎంసీఏ క్రాస్ రోడ్, సెయింట్ జాన్స్ రోటరీ, సంగీత్, ప్యాట్నీ క్రాస్ రోడ్, పార్క్ లేన్, బాటా, ఝాన్సీ మండీ క్రాస్ రోడ్, బైబిల్ హౌజ్, మినిస్టర్ రోడ్, రసూల్‌పూరా రోడ్లలో ఆదివారం (ఈ నెల 17) తెల్లవారుజాము 4 గంటల నుంచి మరుసటి రోజు జాతర పూర్తి అయ్యేదాకా ప్రయాణాలు చేయవద్దని ప్రజలకు సీపీ సూచించారు.
అదే విధంగా పూజల సందర్భంగా మహంకాళి ఆలయం టొబాకో బజార్, హిల్ స్ట్రీట్, సుభాష్ రోడ్ వరకు.. బాటా చౌరస్తా నుంచి రామ్‌గోపాల్ పేట పోలీస్ స్టేషన్ వరకు... అడవయ్య చౌరస్తా నుంచి మహంకాళి ఆలయం వరకు.. జనరల్ బజార్ నుంచి ఆలయ మార్గం రోడ్డు.. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి సెయింట్ మెరీస్ రోడ్డు, క్లాక్ టవర్ వరకు రోడ్లను మూసివేయనున్నట్లు సీపీ పేర్కొన్నారు.