లాయర్లు రూ.10-15 లక్షలు తీసుకుంటే.. సామాన్యుల పరిస్థితి ఏంటి?: కేంద్ర మంత్రి కిరణ్ ఆందోళన

  • అసాధారణ ఫీజులపై ఆవేదన వ్యక్తం చేసిన మంత్రి
  • సామాన్యులకు న్యాయం దూరమవుతుందన్న ఆందోళన
  • వాడుకలో లేని 71 చట్టాలను రద్ధు చేస్తామని ప్రకటన
ప్రముఖ న్యాయవాదులు వసూలు చేస్తున్న భారీ ఫీజుల పట్ల కేంద్ర న్యాయ శాఖ మంత్రి కిరణ్ రిజిజు ఆందోళన వ్యక్తం చేశారు. దేశంలో పేదలు, సామాన్యులకు న్యాయం అందకుండా చేసినట్టు అవుతుందన్నారు. 

‘‘డబ్బున్న వారు పెద్ద లాయర్ల ఫీజులను భరించగలరు. సుప్రీంకోర్టు లాయర్లు కొందరు వసూలు చేసే ఫీజులను సామాన్యులు చెల్లించుకోలేరు. వారు ఒక్కో విచారణకు రూ.10-15 లక్షల చార్జీ వసూలు చేస్తుంటే సామాన్యులు ఎలా చెల్లించుకోగలరు?’’ అని మంత్రి రిజిజు ప్రశ్నించారు. జైపూర్ లో 18వ అఖిల భారత లీగల్ సర్వీసెస్ అథారిటీస్ సమావేశాన్ని ఉద్దేశించి ప్రసంగించారు.

పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లో వాడుకలో లేని 71 చట్టాలను రద్ధు చేయనున్నట్టు మంత్రి తెలిపారు. ఇదే సమావేశంలో పాల్గొన్న రాజస్థాన్ సీఎం గెహ్లాట్.. బహిష్కృత బీజేపీ నేత నుపుర్ శర్మ విషయంలో సుప్రీంకోర్టు న్యాయమూర్తుల వ్యాఖ్యలకు వ్యతిరేకంగా.. నడుస్తున్న ఉద్యమం పట్ల ఆందోళన వ్యక్తం చేశారు. బేరసారాల ద్వారా ప్రభుత్వాలను మారుస్తున్నారంటూ బీజేపీపై మరోసారి విమర్శలు చేశారు.


More Telugu News