మరో 10కి పైగా దేశాల్లో శ్రీలంక మాదిరే దుర్భర పరిస్థితులు
- పరిమితి లేకుండా అప్పులు
- ఆదాయంలో సగం వరకు అప్పులకే చెల్లించాల్సిన పరిస్థితులు
- పాకిస్థాన్, ఎల్ సాల్వెడార్, అర్జెంటీనాలో ఆర్థిక కష్టాలు
- ఐఎంఎఫ్ ఆదుకుంటేనే గట్టేక్కేది..
శ్రీలంక ప్రస్తుతం ఎదుర్కొంటున్న దుర్భర పరిస్థితులకు ఎన్నో కారణాలు ఉన్నాయి. విదేశీ రుణాలు చెల్లించలేనంతగా శ్రీలంక ఎందుకు దెబ్బతిన్నది..? కరోనా వచ్చిన తర్వాత శ్రీలంకకు పర్యాటకం రూపంలో ఆదాయం గణనీయంగా తగ్గిపోయింది. దీంతో తేయాకు, రబ్బరు తదితర పరిశ్రమలపైనే పరిమితం కావాల్సి వచ్చింది.
అదే సమయంలో దేశ ఆర్థిక వ్యవస్థ అంత బలంగా లేదు. విదేశీ మారక నిల్వలు పరిమితంగానే ఉన్నాయి. ఉక్రెయిన్ పై రష్యా దాడి తర్వాత.. అంతర్జాతీయంగా అన్ని ఉత్పత్తుల ధరలు పెరిగిపోయాయి. వాటిని దిగుమతి చేసుకోవడానికి శ్రీలంక వద్దనున్న విదేశీ మారకం నిల్వలు వేగంగా కరిగిపోయాయి. దీంతో ఆ దేశం కుదేలైపోయింది. ఇలాంటి పరిస్థితులే ప్రపంచవ్యాప్తంగా మరిన్నిచిన్న దేశాల్లోనూ నెలకొని ఉన్నాయి.
అర్జెంటీనా
సావరీన్ డిఫాల్ట్ రేటింగ్ తో ఈ దేశం నడుస్తోంది. ఆ దేశ కరెన్సీ పెసో 50 శాతం డిస్కౌంట్ రేటుకు బ్లాక్ మార్కెట్లో ట్రేడ్ అవుతోంది. విదేశీ మారకం నిల్వలు చాలా తక్కువగా ఉన్నాయి. 2024 వరకు ఈ దేశం నెట్టుకు రాగలదు. ఎందుకంటే ఆలోపు విదేశీ రుణాలను పెద్ద మొత్తంలో చెల్లించాల్సిన అవసరం లేకపోవడమే.
ఉక్రెయిన్
రష్యాతో మొండిగా పోరాడుతోంది. పాశ్చాత్య దేశాలు వెనుక నుంచి నడిపిస్తుంటే.. ఉక్రెయిన్ పాలకులు తమ దేశాన్ని శిథిలంగా మార్చుకుంటున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఉక్రెయిన్ తన 20 బిలియన్ డాలర్ల విదేశీ రుణాలను పునరుద్ధరించుకోక తప్పదు. ఈ ఏడాది సెప్టెంబర్ లో 1.2 బిలియన్ డాలర్లను ఈ దేశం చెల్లించాల్సి ఉంది.
ట్యునీషియా
బడ్జెట్ లో 10 శాతం లోటుతో నెట్టుకొస్తోంది. ప్రపంచంలో ప్రభుత్వరంగంలో అత్యధిక వేతనాలు ఇస్తున్న దేశం ఇది. మోర్గాన్ స్టాన్లీ అంచనా వేస్తున్న మూడు డిఫాల్ట్ దేశాల్లో ఉక్రెయిన్, ఎల్ సాల్వెడార్ తోపాటు ట్యునీషియా కూడా ఉంది.
ఘనా
అదే పనిగా అప్పులు చేసుకుంటూ వెళ్లడంతో, వాటిని తీర్చే శక్తి లేక.. ప్రస్తుతం జీడీపీలో అప్పుల రేషియో 85 శాతానికి చేరింది. దేశ కరెన్సీ ఈ ఏడాది మొదటి ఆరు నెలలకే పావు వంతు నష్టపోయింది. ద్రవ్యోల్బణం 30 శాతానికి చేరింది. పన్ను చెల్లింపుల ఆదాయంలో సగాన్ని రుణాల చెల్లింపులకే వాడుకుంటోంది.
ఈజిప్ట్
దేశ అప్పులు జీడీపీలో 95 శాతానికి చేరాయి. వచ్చే ఐదేళ్లలో ఈ దేశం 100 బిలియన్ డాలర్ల రుణాలను చెల్లించాల్సిన పరిస్థితి.
కెన్యా
కెన్యా తన ఆదాయంలో 30 శాతాన్ని అప్పులకు చెల్లిస్తోంది. ఈ దేశ బాండ్లు సగం మేర విలువను కోల్పోయాయి. 2 బిలియన్ డాలర్ బాండ్లు 2024లో చెల్లింపులకు రానున్నాయి. రుణ చెల్లింపుల పరంగా కెన్యా, ఈజిప్ట్, ట్యునీషియా, ఘనా తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటున్నట్టు రేటింగ్ సంస్థ మూడీస్ అంటోంది.
ఎల్ సాల్వెడార్
బిట్ కాయిన్ కు చట్టబద్ధంగా కరెన్సీ హోదా కట్టబెట్టిన దేశం ఇది. ఐఎంఎఫ్ నుంచి సాయానికి తలుపులు మూసుకుపోయాయి. ఆరు నెలల్లో గడువు తీరే బాండ్లు 30 శాతం తక్కువకు ట్రేడ్ అవుతుంటే, దీర్ఘకాల బాండ్లు 70 శాతం డిస్కౌంట్ కే లభిస్తున్నాయి.
పాకిస్థాన్
పాకిస్థాన్ ఐఎంఫ్ సాయం కోసం అర్థిస్తోంది. విదేశీ మారకం నిల్వలు 9.8 బిలియన్ డాలర్లకు తగ్గిపోయాయి. ఐదు వారాల దిగుమతులకే ఇవి చాలతాయి. ఆదాయంలో 40 శాతం వడ్డీలకే పోతోంది. పాక్ రూపీ కూడా భారీగా విలువను కోల్పోయింది.
బెలారస్
ఉక్రెయిన్ పై యుద్ధానికి దిగిన రష్యాకు బెలారస్ మద్దతుగా నిలిచింది. పాశ్చాత్య దేశాల ఆంక్షల దెబ్బకు రష్యా సైతం రుణాలను సకాలంలో చెల్లించలేకపోయింది. ఇప్పుడు అదే పరిస్థితి బెలారస్ కు కూడా రానుంది. ఎందుకంటే రష్యాకు మద్దతుగా ఉన్న బెలారస్ విషయంలోనూ పాశ్చాత్య ప్రపంచం కఠినంగా వ్యవహరిస్తోంది.
ఈక్వెడార్
రెండేళ్ల క్రితమే ఈ దేశం రుణ చెల్లింపుల్లో చేతులు ఎత్తేసింది. నిరసన కారులు అధ్యక్షుడు లాసోను దింపేందుకు హింసకు పాల్పడుతున్నారు. ప్రభుత్వం పెద్ద ఎత్తున ఇంధనం, ఆహారంపై సబ్సిడీ ఇస్తోంది. ఈ పరిస్థితులను అధిగమించగలిగితేనే ఈ దేశం గట్టెక్కగలదు.