తెలంగాణలో నేడు ఓ మోస్తరు, రేపు భారీ వర్షాలు
- రాష్ట్రంలో సాధారణంగా రుతుపవనాల కదలికలు
- ఒడిశా తీరంపై కొనసాగుతున్న అల్పపీడనం
- మహబూబ్‌నగర్ జిల్లాలో అత్యధికంగా 1.4 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు
తెలంగాణలో నేడు ఓ మోస్తరు వర్షాలు, రేపు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ తెలిపింది. ఒడిశా తీరంపై అల్పపీడనం కొనసాగుతోందని, దీనికి అనుబంధంగా 7.6 కిలోమీటర్ల ఎత్తు వరకు గాలులతో ఉపరితల ఆవర్తనం విస్తరించిందని పేర్కొంది. దీనికి తోడు రాష్ట్రంలో రుతుపవనాల కదలికలు సాధారణంగా ఉండడంతో రేపు, ఎల్లుండి వర్షాలు కురుస్తాయని వివరించింది.
నిన్న కూడా రాష్ట్రవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో వర్షాలు కురిశాయి. అత్యధికంగా మహబూబ్‌నగర్‌లోని మహ్మదాబాద్‌లో 1.4 సెంటీమీటర్ల వర్షం కురిసింది. ములుగు జిల్లాలోని ధర్మవరంలో అత్యల్పంగా ఒక సెంటీమీటరు వర్షం కురిసినట్టు అధికారులు తెలిపారు. మరోవైపు, రాష్ట్రవ్యాప్తంగా ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగా నీటమునిగిన లోతట్టు ప్రాంతాలు ఇంకా అందులోంచి బయటపడలేదు. వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి. నీటిమట్టం పూర్తిస్థాయికి చేరుకోవడంతో జలాశయాలు నిండుకుండను తలపిస్తున్నాయి.