బీజేపీ ఎంపీ అర్వింద్ కాన్వాయ్‌పై దాడిని ఖండించిన అమిత్ షా

  • అర్వింద్‌కు స్వ‌యంగా ఫోన్ చేసిన అమిత్ షా
  • దాడిపై వివ‌రాలు తెలుసుకున్న కేంద్ర హోం శాఖ మంత్రి
  • దాడి వెనుక టీఆర్ఎస్ ఎమ్మెల్యే హ‌స్తం ఉంద‌ని ఫిర్యాదు
తెలంగాణ బీజేపీ యువ నేత‌, నిజామాబాద్ ఎంపీ ధ‌ర్మ‌పురి అర్వింద్ కాన్వాయ్‌పై శుక్ర‌వారం జ‌రిగిన దాడిని కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా తీవ్రంగా ఖండించారు. అర్వింద్ కాన్వాయ్‌పై దాడి జ‌రిగింద‌న్న విష‌యం తెలిసిన త‌ర్వాత యువ ఎంపీకి అమిత్ షా స్వ‌యంగా ఫోన్ చేశారు. ఈ సంద‌ర్భంగా దాడి జ‌రిగిన తీరు, అనంత‌ర ప‌రిణామాల‌పై అమిత్ షా ఆరా తీశారు. 

ఈ సంద‌ర్భంగా త‌న‌పై జ‌రిగిన దాడి ఘటనను అమిత్ షాకు అర్వింద్ పూర్తి స్థాయిలో వివ‌రించారు. బీజేపీ నేత‌లు, కార్య‌క‌ర్త‌ల‌ను అధికార టీఆర్ఎస్ నేతలు ల‌క్ష్యంగా చేసుకుని దాడుల‌కు దిగుతున్నార‌ని ఆయన ఫిర్యాదు చేశారు. నిజామాబాద్ నియోజ‌క‌వర్గ ప‌రిధిలో తాను ఎక్క‌డ తిరిగినా.. త‌న‌పై దాడులు చేయాల‌ని టీఆర్ఎస్ అధినాయ‌క‌త్వం ఆ పార్టీ ఎమ్మెల్యేల‌కు ఆదేశాలు జారీ చేసింద‌ని అర్వింద్ తెలిపారు. శుక్ర‌వారం నాడు త‌న కాన్వాయ్‌పై జ‌రిగిన దాడి వెనుక టీఆర్ఎస్ ఎమ్మెల్యే విద్యా సాగ‌ర్ హ‌స్తం ఉంద‌ని ఆయ‌న అమిత్ షాకు ఫిర్యాదు చేశారు.


More Telugu News