లార్డ్స్ వేదికగా మరో అరుదైన చిత్రం!... ఒకే ఫ్రేమ్‌లో ఇద్దరు లెజెండ్లు!
- లార్డ్స్ వేదికగా ఇంగ్లండ్‌తో టీమిండియా రెండో వన్డే
- స్వయంగా స్టాండ్స్‌లో కూర్చుని మ్యాచ్ వీక్షించిన సచిన్
- సర్ గ్యారీ సోబర్స్‌తో కలిసి దిగిన ఫొటోను పంచుకున్న వైనం
భారత క్రికెట్ జట్టు ఇంగ్లండ్ టూర్‌లో భాగంగా ఆ దేశ జట్టుతో టీమిండియా గురువారం లండన్‌లోని ప్రతిష్ఠాత్మక లార్డ్స్ వేదికగా రెండో వన్డే మ్యాచ్ జరిగిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్ సందర్భంగా పలు ఆసక్తికర దృశ్యాలు కనిపించాయి. టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ... తన సహచరుడు సురేశ్ రైనాతో కలిసి ఈ మ్యాచ్‌ను వీక్షించాడు. ఇక మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ కూడా ఈ మ్యాచ్‌ను వీక్షించేందుకు లార్డ్స్ వచ్చాడు. తన సహచర ఆటగాడు, టీమిండియా మాజీ కెప్టెన్, బీసీసీఐ ప్రస్తుత అధ్యక్షుడు సౌరవ్ గంగూలీతో కలిసి సచిన్ సందడి చేశాడు.
తాజాగా లార్డ్స్ వేదికగానే నిన్నటి మరో అరుదైన సన్నివేశాన్ని సచిన్ స్వయంగా వెల్లడించాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో సచిన్‌కు ఏ పాటి పేరుందో.. అదే మాదిరి గుర్తింపును అంతకంటే ముందుగానే సంపాదించుకున్న దిగ్గజ క్రికెటర్ సర్ గ్యారీ సోబర్స్‌తో కలిసి లార్డ్స్‌లో సచిన్ ఓ ఫొటో తీసుకున్నారు. ఈ ఫొటోను శుక్రవారం మధ్యాహ్నం సచిన్ తన సోషల్ మీడియా ఖాతాల్లో పోస్ట్ చేశారు. లార్డ్స్‌లో మ్యాచ్‌ను చూడటంతో పాటు ఆటలో వన్ అండ్ ఓన్లీగా నిలిచిన సర్ గ్యారీని కూడా కలిశానంటూ సచిన్ ఆ ఫొటోకు కామెంట్ జత చేశాడు.