దేశంలో అగ్రగామి విద్యా సంస్థలు ఇవే.. ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకుల విడుదల

దేశంలో అగ్రగామి విద్యా సంస్థలు ఇవే.. ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకుల విడుదల
  • మొదటి మూడు స్థానాల్లో గతేడాది ఉన్న సంస్థలే
  • ఐఐటీ మద్రాస్, ఐఐఎస్ సీ బెంగళూరు, ఐఐటీ బాంబేలకు తొలి మూడు ర్యాంకులు
  • విడుదల చేసిన కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్
దేశంలోని అత్యుత్తమ ప్రమాణాలు చూపిస్తున్న విద్యా సంస్థల వివరాలు వెల్లడయ్యాయి. ఉన్నత విద్యా సంస్థలు, 2022 ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకుల వివరాలను కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ శుక్రవారం ఢిల్లీలో విడుదల చేశారు. నేషనల్ ఇనిస్టిట్యూషనల్ ర్యాంకింగ్ ఫ్రేమ్ వర్క్ ను ఎన్ఐఆర్ఎఫ్ గా చెబుతారు. ఇందులో ఐఐటీ మద్రాస్ వరుసగా నాలుగో ఏడాది మొదటి ర్యాంకును సొంతం చేసుకుంది. రెండు, మూడో స్థానాల్లో ఐఐఎస్ సీ బెంగళూరు, ఐఐటీ బాంబే ఉన్నాయి.

గతేడాది ర్యాంకులతో పోల్చి చూస్తే, ఈ ఏడాది మొదటి మూడు స్థానాల్లో ఎటువంటి మార్పులు చోటు చేసుకోలేదు. అవే విద్యా సంస్థలు కొనసాగాయి. ఢిల్లీ ఎయిమ్స్ ఉత్తమ వైద్య కళాశాలగా, నేషనల్ లా స్కూల్ ఆఫ్ ఇండియా యూనివర్సిటీ, బెంగళూరు దేశంలోనే అగ్రగామి న్యాయ కళాశాలగా, మిరండా హౌస్ అత్యుత్తమ కళాశాలగా ర్యాంకులు సంపాదించాయి. 

దేశవ్యాప్తంగా 45,000 డిగ్రీ కాలేజీలు, 1,000 యూనివర్సిటీలు, 1,500 ప్రముఖ విద్యా సంస్థలు ఉన్నాయి. వీటిల్లో 2021లో 6,000 సంస్థలే ర్యాంకుల్లో పాల్గొన్నాయి. 2022 ర్యాంకుల కోసం 7,254 విద్యా సంస్థలు పోటీ పడ్డాయి. 

టాప్-10 ఇనిస్టిట్యూషన్స్ (ఓవరాల్ కేటగిరీ)
  • ఐఐటీ మద్రాస్, చెన్నై, తమిళనాడు
  • ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ సైన్స్ (ఐఐఎస్ సీ), బెంగళూరు, కర్ణాటక
  • ఐఐటీ బాంబే, ముంబై, మహారాష్ట్ర
  • ఐఐటీ ఢిల్లీ, ఢిల్లీ
  • ఐఐటీ కాన్పూర్, యూపీ
  • ఐఐటీ ఖరగ్ పూర్, పశ్చిమబెంగాల్
  • ఐఐటీ రూర్కీ, ఉత్తరాఖండ్
  • ఐఐటీ గువాహటి, అసోం
  • ఎయిమ్స్, న్యూఢిల్లీ 
  • జవహర్ లాల్ నెహ్రూ యూనివర్సిటీ (జేఎన్ యూ), న్యూ ఢిల్లీ 

టాప్-3 యూనివర్సిటీలు
  • ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ సైన్స్ (ఐఐఎస్ సీ), బెంగళూరు, కర్ణాటక
  • జవహర్ లాల్ నెహ్రూ యూనివర్సిటీ (జేఎన్ యూ), న్యూ ఢిల్లీ
  • ఢిల్లీజామియా మిలియా ఇస్లామియా (జేఎంఐ), న్యూఢిల్లీ, ఢిల్లీ

టాప్-3 ఇంజనీరింగ్ సంస్థలు
  • ఐఐటీ మద్రాస్, చెన్నై, తమిళనాడు
  • ఐఐటీ ఢిల్లీ, న్యూఢిల్లీ
  • ఐఐటీ బాంబే, ముంబై, మహారాష్ట్ర

టాప్-3 మేనేజ్ మెంట్ విద్యా సంస్థలు
  • ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మేనేజ్ మెంట్ (ఐఐఎం), అహ్మదాబాద్, గుజరాత్
  • ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మేనేజ్ మెంట్ (ఐఐఎం), బెంగళూరు, కర్ణాటక
  • ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మేనేజ్ మెంట్ (ఐఐఎం), కోల్ కత్తా, పశ్చిమబెంగాల్

టాప్-3 వైద్య కళాశాలలు
  • ఎయిమ్స్, న్యూఢిల్లీ 
  • పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్, చండీగఢ్
  • క్రిస్టియన్ మెడికల్ కాలేజ్, వెల్లూరు, తమిళనాడు


More Telugu News