ఆల్కహాల్ తో యువతకే ఎక్కువ రిస్క్ అంటున్న తాజా అధ్యయనం
- 15-39 ఏళ్ల వయసులోని వారికి అధిక రిస్క్
- 40 ఏళ్లపైన వయసు వారికి ఆరోగ్య ప్రయోజనాలు
- యువత ఆల్కహాల్ కు దూరంగా ఉండాలని సూచన
మద్యపానం వల్ల కలిగే అనర్థాలను ఎన్నో పరిశోధనలు, అధ్యయనాలు వెలుగులోకి తీసుకొచ్చాయి. కానీ, వినియోగం ఏ మాత్రం తగ్గలేదు. సరికదా ఏటేటా పెరుగుతూ వెళుతోంది. ప్రపంచవ్యాప్తంగా ఆధునిక సమాజంలో మద్యపాన సేవనం సాధారణంగా మారిపోయింది ఈ క్రమంలో యువతకు కనివిప్పు కలిగించే ఒక అధ్యయన ఫలితాలు వెలువడ్డాయి.
పెద్ద వయసు వారితో పోలిస్తే యువతలోనే (40 ఏళ్లలోపు) మద్యపానం వల్ల అనర్థాలు ఎక్కువగా ఉంటున్నాయని లాన్సెట్ జర్నల్ లో శుక్రవారం వెలువడిన ఒక అధ్యయనం ఫలితాలు చెబుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా 15-39 ఏళ్లలోపు వారికి ఆల్కహాల్ సేవనంతో ఎంతో హానికారక రిస్క్ ఉంటోందని పేర్కొంది. అదే ఎటువంటి వైద్య సమస్యలు లేని, 40 ఏళ్లకు పైన వయసులోని వారు రోజులో ఒకటి నుంచి రెండు స్టాండర్డ్ డ్రింక్ ను తీసుకోవడం వల్ల ప్రయోజనాలు ఉంటున్నాయని పరిశోధకులు గుర్తించారు.
ఒక స్టాండర్డ్ డ్రింక్ అంటే.. బీరు 375 మిల్లీ లీటర్లు (3.5 శాతం ఆల్కహాల్). బ్రాందీ, విస్కీ, జిన్, వోడ్కా అయితే 30 ఎంఎల్ (40 శాతం ఆల్కహాల్) . ఇలా తక్కువ మోతాదులో తీసుకునే 40 ఏళ్ల పైన వారికి గుండె జబ్బులు, స్ట్రోక్, మధుమేహం ముప్పు తగ్గుతున్నట్టు పరిశోధకులు తెలుసుకున్నారు.
ఇక ప్రపంచవ్యాప్తంగా 204 దేశాల్లో 134 కోట్ల మంది 2020లో ఆల్కహాల్ సేవించినట్టు అంచనా. హానికారక స్థాయిలో మద్యం సేవిస్తోంది 15-39 మధ్య వయసులోని వారే ఎక్కువగా ఉంటున్నట్టు తెలిసింది. ఆల్కహాల్ సేవనంతో ఎటువంటి ఆరోగ్య ప్రయోజనాలు లేవన్న ఈ అధ్యయనం, అధిక హెల్త్ రిస్క్ లకు దారితీస్తుందని హెచ్చరించింది.
ఆల్కహాల్ వల్ల జరుగుతున్న ప్రమాదాల్లో 60 శాతం 15-39 వయసు నుంచే ఉంటున్నాయి. ‘‘మా సందేహం సులభం. యువత డ్రింక్ చేయవద్దు. పెద్ద వయసులోని వారు స్వల్పమోతాదుతో ఆరోగ్య ప్రయోజనాలు పొందొచ్చు’’ అని ఈ అధ్యయనం సీనియర్ రచయిత ఎమాన్యుయేల్ గకిడో తెలిపారు.
ఇక ప్రపంచవ్యాప్తంగా 204 దేశాల్లో 134 కోట్ల మంది 2020లో ఆల్కహాల్ సేవించినట్టు అంచనా. హానికారక స్థాయిలో మద్యం సేవిస్తోంది 15-39 మధ్య వయసులోని వారే ఎక్కువగా ఉంటున్నట్టు తెలిసింది. ఆల్కహాల్ సేవనంతో ఎటువంటి ఆరోగ్య ప్రయోజనాలు లేవన్న ఈ అధ్యయనం, అధిక హెల్త్ రిస్క్ లకు దారితీస్తుందని హెచ్చరించింది.