ఢిల్లీ-వడోదర ఇండిగో విమానం ఇంజిన్‌లో ప్రకంపనలు.. జైపూర్‌కు మళ్లింపు
- విమానం ఇంజిన్‌లో క్షణకాలంపాటు కంపనాలు
- అత్యవసరంగా జైపూర్‌లో ల్యాండ్ చేసిన పైలట్
- ప్రయాణికుల కోసం ప్రత్యామ్నాయ విమానం ఏర్పాటు
- దర్యాప్తునకు ఆదేశించిన డీజీసీఏ
ఢిల్లీ నుంచి వడోదర వెళ్తున్న ఇండిగో విమానం ఇంజిన్‌లో క్షణకాలంపాటు ప్రకంపనలు రావడంతో విమానాన్ని అత్యవసరంగా జైపూర్‌కు మళ్లించారు. గత రాత్రి జరిగిందీ ఘటన. అనంతరం అందులోని ప్రయాణికులను గమ్యస్థానానికి చేర్చేందుకు ప్రత్యామ్నాయ విమనాన్ని ఏర్పాటు చేశారు. ఈ విషయాన్ని ఇండిగో అధికార ప్రతినిధి నిర్ధారించారు. విమానం ఇంజిన్‌లో ప్రకంపనలు రేగడంతో అత్యవసరంగా ఇండిగో విమానం 6E-859ను జైపూర్ మళ్లించినట్టు తెలిపారు.
మార్గమధ్యంలోనే పైలట్‌కు హెచ్చరిక సందేశం అందిందని, దీంతో ముందుజాగ్రత్త చర్యగా తదుపరి తనిఖీల కోసం విమానాన్ని పైలట్ జైపూర్‌కు మళ్లించాడని ఆయన పేర్కొన్నారు. ప్రత్యామ్నాయ విమానం ద్వారా ప్రయాణికులను గమ్యస్థానాలకు చేర్చినట్టు చెప్పారు. ఈ ఘటనపై దర్యాప్తునకు ఆదేశించినట్టు డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (DGCA) తెలిపింది.