రేపు విశాఖ టూర్‌కు జగన్... వాహన మిత్ర నిధులను విడుదల చేయనున్న సీఎం
- 13న జరగాల్సి ఉన్న జగన్ విశాఖ పర్యటన
- వర్షాల కారణంగా రేపటికి వాయిదా వేసిన వైనం
- వాహన మిత్ర లబ్ధిదారుల ఖాతాల్లో నిధులను జమ చేయనున్న జగన్
ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి శుక్రవారం విశాఖ పర్యటనకు వెళ్లనున్నారు. వాస్తవానికి ఈ నెల 13 (బుధవారం)న విశాఖకు వెళ్లాల్సిన జగన్... వర్షాల కారణంగా తన పర్యటనను వాయిదా వేసుకున్న సంగతి తెలిసిందే. రేపటి విశాఖ పర్యటనలో భాగంగా వైఎస్సార్ వాహన మిత్ర పథకం లబ్ధిదారుల ఖాతాల్లో ఈ ఏడాది నిధులను జగన్ జమ చేయనున్నారు. సొంత వాహనాలు కలిగిన ఆటో, క్యాబ్ డ్రైవర్లకు ఏడాదికి రూ.10వేల చొప్పున ఆర్థిక సాయం అందించేందుకు జగన్ సర్కారు ఈ పథకాన్ని ప్రారంభించిన సంగతి తెలిసిందే.
విశాఖ టూర్‌లో భాగంగా రేపు నగరంలోని ఆంధ్రా విశ్వవిద్యాలయంలో ఏర్పాటు చేయనున్న వేదిక మీద జగన్ వాహనమిత్ర నిధులను విడుదల చేయనున్నారు. అనంతరం లబ్ధిదారులతో ఆయన ముఖాముఖి నిర్వహిస్తారు. ఆ తర్వాత బహిరంగ సభలో ప్రజలను ఉద్దేశించి మాట్లాడతారు. ఈ కార్యక్రమం ముగిసిన తర్వాత జగన్ మధ్యాహ్న సమయంలో తిరిగి తాడేపల్లి చేరుకుంటారు.