ఎంపీ అర్వింద్ ను చెప్పుతో కొట్టాలన్న టీఆర్ఎస్ ఎమ్మెల్యే షకీల్.. పందిని నేను పట్టించుకోనన్న అర్వింద్!
- వరదల సమయంలో అర్వింద్ ఎక్కడున్నారన్న షకీల్
- కేసీఆర్ ను తిట్టడం తప్ప ఏమీ చేయడని మండిపాటు
- వరద నష్టంపై నివేదికలు పంపడం కేసీఆర్ ప్రభుత్వానికి చేతకాదన్న అర్వింద్
బోధన్ టీఆర్ఎస్ ఎమ్మెల్యే షకీల్, బీజేపీ నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ ల మధ్య మాటల తూటాలు పేలాయి. ప్రజలు భారీ వర్షాలు, వరదలతో అల్లాడిపోతుంటే ఎంపీ అర్వింద్ ఎక్కడున్నారని షకీల్ ప్రశ్నించారు. ఎంత సేపు ముఖ్యమంత్రిని తిట్టడం తప్ప ఆయనకు మరోపని లేదని అన్నారు.
అమెరికా నుంచి, ఢిల్లీ నుంచి, హైదరాబాద్ నుంచి సోషల్ మీడియాలో కామెంట్లు చేయడమే ఆయన పని అని అన్నారు. రాష్ట్రానికి కేంద్రం నుంచి ఇంత వరకు ఒక్క రూపాయి కూడా తీసుకురాలేదని విమర్శించారు. వరదల సమయంలో ప్రజలను పట్టించుకోకుండా తిరుగుతున్న అర్వింద్ వస్తే... ప్రజలు నిలదీయాలని, చెప్పుతో కొట్టాలని అన్నారు.
ఈ వ్యాఖ్యలపై అర్వింద్ కూడా అదే స్థాయిలో స్పందించారు. షకీల్ ను పందితో పోల్చారు. పందిని తాను పట్టించుకోనని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం నివేదికలు పంపితే కేంద్రం సాయం చేస్తుందని అన్నారు. వరద నష్టంపై నివేదికలు పంపడం కేసీఆర్ సర్కార్ కు చేత కాదని ఎద్దేవా చేశారు.