'మాచర్ల నియోజకవర్గం'లో రాజప్పగా సముద్రఖని లుక్ !

  • పొలిటికల్ థ్రిల్లర్ గా 'మాచర్ల నియోజకవర్గం'
  • నితిన్ సరసన నాయికగా కృతి శెట్టి 
  • కీలకమైన పాత్రలో సముద్రఖని 
  • ఆగస్టు 12వ తేదీన సినిమా విడుదల   
నితిన్ హీరోగా 'మాచర్ల నియోజకవర్గం' సినిమా రూపొందింది. నితిన్ సొంత బ్యానర్లో నిర్మితమైన సినిమా ఇది. గ్రామీణ నేపథ్యంలో పోలిటికల్ థ్రిల్లర్ జోనర్లో నడిచే ఈ సినిమాతో, దర్శకుడిగా రాజశేఖర్ రెడ్డి పరిచయమవుతున్నాడు. ఈ సినిమాలో నితిన్ సరసన నాయికగా కృతి శెట్టి సందడి చేయనుంది. 

మరో కథానాయికగా కేథరిన్ అలరించనున్న ఈ సినిమాలో, 'రాజప్ప'గా సముద్రఖని ఒక కీలకమైన పాత్రను పోషించాడు. ఆయన పాత్రకి సంబంధించిన పోస్టర్ ను కొంతసేపటి క్రితం రిలీజ్ చేశారు. నెరసిన జుట్టు .. గుబురు మీసాలుతో కాస్త వయసు మళ్లిన పాత్రలో .. ఊరికి పెద్దమనిషి అనుకునే తరహాలో కనిపిస్తున్నాడు. 

తెలుగులో సముద్రఖని పాత్ర కోసం ఈ స్థాయిలో డిఫరెంట్ లుక్ తో కనిపించడం ఇదే ఫస్టు టైమ్. ఆయన లుక్ ను బట్టి పాత్ర చాలా పవర్ఫుల్ అనే విషయం తెలిసిపోతూనే ఉంది. మహతి స్వరసాగర్ సంగీతాన్ని సమకూర్చిన ఈ సినిమాను ఆగస్టు 12వ తేదీన విడుదల చేయనున్నారు.


More Telugu News