దేశంలో మంకీపాక్స్ కలకలం.. యూఏఈ నుంచి వచ్చిన కేరళ ప్రయాణికుడిలో లక్షణాలు

  • మూడు రోజుల క్రితం యూఏఈ నుంచి వచ్చిన ప్రయాణికుడు
  • లక్షణాలు కనిపించడంతో అబ్జర్వేషన్‌లో ఉంచిన వైద్యులు
  • పూణెలోని వైరాలజీ ల్యాబ్‌కు నమూనాలు
  • నేటి సాయంత్రంలోగా ఫలితాలు
దేశంలో మంకీపాక్స్ కలకలం రేగింది. మూడు రోజుల క్రితం యునైటెడ్ అరబ్‌ ఎమిరేట్స్ (UAE) నుంచి కేరళ చేరుకున్న ప్రయాణికుడిలో మంకీపాక్స్ లక్షణాలు కనిపించినట్టు రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి వీణా జార్జ్ తెలిపారు. ప్రస్తుతం అతడు అబ్జర్వేషన్‌లో ఉన్నాడని, వ్యాధి లక్షణాలు కనిపించిన తర్వాత శాంపిల్స్ సేకరించి పూణెలోని వైరాలజీ ఇనిస్టిట్యూట్‌కు పంపినట్టు చెప్పారు. నేటి సాయంత్రంలోగా నివేదిక వస్తుందన్నారు. 

ఒకవేళ ఇది కనుక మంకీపాక్స్‌గా నిర్ధారణ అయితే దేశంలో ఇదే తొలి కేసు అవుతుంది. ఈ నెల 11 నాటికి అమెరికాలో దాదాపు 800 మంకీపాక్స్ కేసులు నమోదయ్యాయి. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటి వరకు 57 దేశాల్లో 8,200 కేసులు నమోదయ్యాయి. 1958లో పరిశోధన కోసం తెచ్చిన కోతుల్లో ఈ వైరస్ బయటపడడంతో దానిని మంకీ వైరస్‌గా పిలుస్తున్నారు. అమ్మవారిగా వ్యవహరించే మశూచిలానే ఇది కూడా అదే కుటుంబానికి చెందినది.


More Telugu News