ప్రధాని మోదీ హత్యకు కుట్ర.. ఛేదించిన బీహార్ పోలీసులు
- ఇంటెలిజెన్స్ బ్యూరో సమాచారం మేరకు రంగంలోకి దిగిన పోలీసులు
- ఇద్దరు ఉగ్రవాదుల అరెస్ట్
- 2047 నాటికి భారత్ ను ఇస్లామిక్ రాజ్యంగా మార్చాలనే లక్ష్యం వెలుగులోకి
ప్రధాని నరేంద్ర మోదీపై దాడికి ఉగ్రవాదులు పన్నిన కుట్రను బీహార్ పోలీసులు ఛేదించారు. ఈ సందర్భంగా పాట్నాలో ఇద్దరు అనుమానిత ఉగ్రవాదులను అరెస్ట్ చేశారు. 2047 నాటికి భారత్ ను ఇస్లామిక్ రాజ్యంగా చేయాలన్నది ఉగ్రవాదుల లక్ష్యమని.. అలాగే, ప్రధాని మోదీ రెండో లక్ష్యంగా ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. జులై 12న ప్రధాని పర్యటన సందర్భంగా ఆయనను లక్ష్యం చేసుకోవాలని ఉగ్రవాదులు కుట్ర పన్నినట్టు బీహార్ పోలీసులు ప్రకటించారు.
అస్థార్ పర్వేజ్, జలూలుద్దీన్ అనే ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రధాని పర్యటనకు 15 రోజుల ముందు పాట్నాలోని పుల్వారీ షరీఫ్ ప్రాంతంలో వీరు శిక్షణ పొందినట్టు తెలుసుకున్నారు. ఆ ప్రాంతం నుంచి పోలీసులు కొన్ని డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నారు. వీటి ద్వారానే ఇస్లామిక్ రాజ్య స్థాపన లక్ష్యం బయటపడింది. పుల్వారీ షరీఫ్ ప్రాంతంలో ఉగ్రవాదుల కదలికల సమాచారం ఇంటెలిజెన్స్ బ్యూరోకి తెలియడంతో, బీహార్ పోలీసులకు, ఎన్ఐఏకు సమాచారం ఇచ్చింది. దీని ప్రకారం ఉగ్రవాదులను పట్టుకొన్నారు. దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల నుంచి యువత పుల్వామా షరీఫ్ ప్రాంతానికి వచ్చి ఉగ్రవాదంలో శిక్షణ తీసుకుంటున్నట్టు గుర్తించారు.