సీతాఫ‌ల్‌మండీ స‌ర్కారీ విద్యాల‌యాల అభివృద్ధికి రూ.29 కోట్లు విడుద‌ల చేసిన కేసీఆర్‌

  • నిధులు విడుద‌ల చేస్తూ తెలంగాణ స‌ర్కారు ఉత్త‌ర్వుల జారీ
  • కేసీఆర్‌కు కృత‌జ్ఞ‌త‌లు తెలిపిన జీహెచ్ఎంసీ కార్పొరేట‌ర్ హేమ శ్యామ‌ల‌
  • డిప్యూటీ స్పీక‌ర్‌తో క‌లిసి ప్రగతి భవన్ కు వెళ్లిన కార్పొరేటర్ 
సికింద్రాబాద్ ప‌రిధిలోని సీతాఫ‌ల్‌మండీకి చెందిన 3 ప్ర‌భుత్వ విద్యాల‌యాల అభివృద్ధి కోసం తెలంగాణ స‌ర్కారు ఏకంగా రూ.29 కోట్ల‌ను విడుద‌ల చేసింది. ఈ మేర‌కు బుధ‌వారం కేసీఆర్ స‌ర్కారు నిధులను విడుద‌ల చేస్తూ ఉత్త‌ర్వులు జారీ చేసింది. ఈ నిధుల్లో సీతాఫ‌ల్‌మండీ ప్ర‌భుత్వ పాఠ‌శాల అభివృద్ధికి రూ.14 కోట్లు, జూనియ‌ర్ క‌ళాశాల‌కు రూ.6 కోట్లు, డిగ్రీ క‌ళాశాల‌కు రూ.9 కోట్ల‌ను కేటాయిస్తూ ప్ర‌భుత్వం ఉత్త‌ర్వులు జారీ చేసింది. 

3 విద్యాల‌యాల అభివృద్ది కోసం ఏకంగా రూ.29 కోట్ల‌ను విడుద‌ల చేసిన సీఎం కేసీఆర్‌కు టీఆర్ఎస్ జీహెచ్ఎంసీ కార్పొరేట‌ర్ హేమ శ్యామ‌ల ప్ర‌త్యేకంగా కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు. సికింద్రాబాద్ నుంచి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వ‌హిస్తున్న తెలంగాణ అసెంబ్లీ డిప్యూటీ స్పీక‌ర్ ప‌ద్మారావు గౌడ్‌తో క‌లిసి ఈ రోజు ఆమె ప్ర‌గ‌తి భ‌వ‌న్‌కు వెళ్లారు. 35 ఏళ్లుగా అభివృద్ధికి నోచుకోని విద్యాల‌యాల కోసం నిధులు విడుద‌ల చేసినందుకు కేసీఆర్‌కు ఆమె కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు.


More Telugu News