గుండెకు రంధ్రంతో బాధపడుతున్న చిన్నారి... ఎమ్మెల్యే కోటంరెడ్డి ఆసరా
- గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం చేపట్టిన కోటంరెడ్డి
- ఉప్పుటూరులో ఓ చిన్నారి దీనస్థితికి చలించిపోయిన వైనం
- తిరుపతిలో బాలికకు శస్త్రచికిత్స.. విజయవంతం
- ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలిపిన తల్లిదండ్రులు
నెల్లూరు రూరల్ పరిధిలోని ఉప్పుటూరు గ్రామానికి చెందిన పొట్లూరు స్నేహ అనే గిరిజన బాలిక గుండెలో రంధ్రంతో బాధపడుతోంది. ఇటీవల నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం నిర్వహించగా, ఈ చిన్నారి అనారోగ్యం విషయం ఆయన దృష్టికి వచ్చింది. స్నేహ తల్లిదండ్రులు పేదవాళ్లని స్థానిక నేతలు ఎమ్మెల్యేకి వివరించారు. బాలిక తల్లిదండ్రులు కూడా తమ దీనస్థితిని కోటంరెడ్డికి విన్నవించుకున్నారు. దాంతో ఆయన చలించిపోయారు.
తిరుపతిలోని పెద్దాసుపత్రిలో ఆ బాలిక చికిత్సకు ఏర్పాట్లు చేయించారు. ఓ కారు ఏర్పాటు చేసి, తన ప్రతినిధిని కూడా బాలికతో పాటు తిరుపతి పంపించారు. అక్కడి డాక్టర్లతో మాట్లాడారు. కాగా, ఆ బాలిక గుండెకు వైద్యులు ఆరోగ్యశ్రీ కింద శస్త్రచికిత్స చేయగా, విజయవంతమైంది. ఈ విషయం తెలిసి వైసీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి సంతోషం వ్యక్తం చేశారు. ఇటీవలే బాలిక డిశ్చార్జి అయింది. ఆ చిన్నారితో కలిసి తల్లిదండ్రులు కోటంరెడ్డి ఆఫీసుకు వచ్చి కృతజ్ఞతలు తెలిపారు.