శ్రీలంకలో ఎమర్జెన్సీ విధింపు.. ప్రధాని నివాసంలోకి దూసుకుపోయిన ఆందోళనకారులు.. వీడియో ఇదిగో!
- శ్రీలంకలో దిగజారుతున్న పరిస్థితులు
- ప్రధాని నివాసాన్ని ముట్టడించిన వేలాది మంది నిరసనకారులు
- ఎమర్జెన్సీ విధించినట్టు ప్రకటించిన ప్రధాని కార్యాలయం
శ్రీలంక అట్టుడుకుతోంది. రావణుడి గడ్డ రావణకాష్ఠంలా రగులుతోంది. పూర్తిగా సంక్షోభంలో కూరుకుపోయిన ఆ దేశంలో పరిస్థితులు అంతకంతకూ దిగజారుతున్నాయి. ఆందోళకారుల దెబ్బకు ఆ దేశాధ్యక్షుడు గొటబాయ రాజపక్స దేశం విడిచి పారిపోయారు. ఈరోజు రాజీనామా చేస్తానని ఆయన ప్రకటించారు.
అయితే, తక్షణమే ఆయన రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ అక్కడి ప్రజలు ఆందోళనలను తీవ్రతరం చేశారు. అంతేకాదు, శ్రీలంక ప్రధాని నివాసాన్ని వేలాది మంది ముట్టడించారు. ప్రధాని నివాసం గోడఎక్కి లోపలకు దూసుకెళ్లారు. ఈ క్రమంలో వారిని చెదరగొట్టేందుకు భద్రతాబలగాలు బాష్పవాయుగోళాలను ప్రయోగిస్తున్నాయి. అయినా ఆందోళన కారులు తగ్గడం లేదు. మరోవైపు, పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు శ్రీలంక ప్రభుత్వం ఎమర్జెన్సీని విధిస్తున్నట్టు ప్రకటించింది. ఈమేరకు శ్రీలంక ప్రధాని కార్యాలయం నుంచి అధికారిక ప్రకటన వెలువడింది.