ఒక్క విజయంతో వన్డే ర్యాంకుల్లో పాకిస్థాన్‌ను అధిగమించిన భారత్
- 108 రేటింగ్ పాయింట్లతో మూడో స్థానానికి చేరిన టీమ్ ఇండియా
- తొలి వన్డేలో ఇంగ్లండ్ జట్టుపై ఘన విజయంతో ర్యాంక్ మెరుగు
- పాకిస్థాన్ 106 రేటింగ్ పాయింట్లతో నాలుగో స్థానానికి
- అగ్రస్థానంలో ఉన్న న్యూజిలాండ్
ఇంగ్లండ్‌తో వన్డే సిరీస్‌లో మంగళవారం జరిగిన తొలి మ్యాచ్‌లో 10 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించిన భారత్ ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్ లో తన ర్యాంక్ ను మెరుగు పరుచుకుంది. తాజాగా విడుదలైన టీమ్ ర్యాంకింగ్స్ లో పాకిస్థాన్‌ను వెనక్కి నెట్టి మూడో స్థానానికి చేరుకుంది. ఇంగ్లండ్‌తో మ్యాచ్‌కు ముందు 105 రేటింగ్ పాయింట్లతో నాలుగో స్థానంలో నిలిచిన రోహిత్ సేన ఇప్పుడు 108 రేటింగ్ పాయింట్లతో మూడో స్థానానికి ఎగబాకింది. 106 రేటింగ్ పాయింట్లతో పాకిస్థాన్ నాలుగో ర్యాంకుకు పడిపోయింది.
126 రేటింగ్ పాయింట్లతో న్యూజిలాండ్ అగ్రస్థానంలో ఉండగా, 122 రేటింగ్ పాయింట్లతో ఇంగ్లండ్ రెండో స్థానంలో నిలిచింది. ఆస్ట్రేలియా 101 రేటింగ్ పాయింట్లతో ఐదో స్థానం సాధించింది. దక్షిణాఫ్రికా (99 పాయింట్లు), బంగ్లాదేశ్ (96), శ్రీలంక (92), వెస్టిండీస్ (71), ఆఫ్గనిస్థాన్ (69) వరుసగా ఆరు నుంచి పది స్థానాల్లో నిలిచాయి.