కరోనా కేసులే కాదు.. మృతుల సంఖ్య కూడా పెరిగింది!
- గత 24 గంటల్లో 16,906 పాజిటివ్ కేసుల నమోదు
- దేశ వ్యాప్తంగా 45 మంది మృతి
- దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య 1,32,457
దేశంలో కరోనా కేసులు మళ్లీ పెరిగాయి. గత 24 గంటల్లో 16,906 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ముందు రోజుతో పోలిస్తే ఈ సంఖ్య దాదాపు 3 వేలు ఎక్కువ. ఇదే సమయంలో దేశంలో కరోనా మృతుల సంఖ్య కూడా పెరిగింది. గత 24 గంటల్లో 45 మంది కరోనా కారణంగా మృతి చెందారు. ఇదే సమయంలో 15,447 మంది కోలుకున్నారు. ప్రస్తుతం దేశంలో 1,32,457 యాక్టివ్ కేసులు ఉన్నాయి.
మన దేశంలో ఇప్పటి వరకు 4,30,11,874 మంది కరోనా నుంచి కోలుకున్నారు. మొత్తం 5,25,519 మంది మృత్యువాత పడ్డారు. దేశంలో పాజిటివిటీ రేటు 3.68 శాతంగా, క్రియాశీల రేటు 0.30 శాతంగా, రికవరీ రేటు 98.49 శాతంగా, మరణాల రేటు 1.20 శాతంగా ఉంది. ఇప్పటి వరకు 1,99,12,79,010 డోసుల కరోనా వ్యాక్సిన్ పంపిణీ చేశారు. నిన్న 11,15,068 మంది వ్యాక్సిన్ వేయించుకున్నారు.