రోహిత్ సిక్సర్‌కు గాయపడిన బాలిక.. ట్రీట్‌మెంట్ చేసిన ఇంగ్లండ్ టీం వైద్యులు: వీడియో ఇదిగో
- ఐదో ఓవర్‌లో డేవిడ్ విల్లీ వేసిన బంతిని సిక్స్ కొట్టిన రోహిత్
- నేరుగా వెళ్లి చిన్నారి వీపును తాకిన బంతి
- కాసేపు ఆగిపోయిన మ్యాచ్
మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా గతరాత్రి లండన్‌లోని కెన్నింగ్టన్ ఓవల్ మైదానంలో జరిగిన తొలి వన్డేలో భారత్ ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో చెలరేగి ఆడిన టీమిండియా సారథి రోహిత్ శర్మ కొట్టిన ఓ సిక్సర్ స్టాండ్స్‌లో తండ్రితో కలిసి మ్యాచ్ చూస్తున్న బాలికను గాయపరిచింది. ఐదో ఓవర్‌లో డేవిడ్ విల్లీ వేసిన ఓ బంతిని రోహిత్ శర్మ ఫైన్ లెగ్ మీదుగా సిక్సర్‌గా మలిచాడు.
అంపైర్ రెండు చేతులు ఎత్తి దానిని సిక్సర్‌గా ప్రకటించిన తర్వాత కెమెరాలన్నీ ఒక్కసారిగా స్టాండ్స్ వైపు తిరిగాయి. రోహిత్ కొట్టిన బంతి నేరుగా వెళ్లి మ్యాచ్‌ను తిలకిస్తున్న చిన్నారి వీపుకు తాకింది. వెంటనే ఓ వ్యక్తి (బహుశా చిన్నారి తండ్రి) ఆమెను ఎత్తుకుని వీపుపై రుద్దుతూ కనిపించాడు. దీంతో మ్యాచ్ కొన్ని నిమిషాలపాటు ఆగిపోయింది.
రోహిత్ కొట్టిన బంతి చిన్నారికి తగిలినట్టు కామెంటేటర్లు రవిశాస్త్రి, అర్థర్‌టన్ ప్రకటించారు. అయితే, పెద్దగా గాయం కాలేదని చెప్పడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఆ తర్వాత ఆట మొదలైంది. విషయం తెలిసిన వెంటనే ఇంగ్లండ్ టీమ్ డాక్టర్లు చిన్నారి వద్దకు వెళ్లి చికిత్స అందించారు. వైద్యులు చిన్నారి వైపు పరిగెత్తడం వీడియోలో కనిపించింది.