ఏపీకి రాష్ట్రీయ ఖనిజ వికాస్ అవార్డు... రూ.2.4 కోట్ల నగదు పురస్కారం అందించిన కేంద్రం
- ఖనిజాల అన్వేషణ, వేలం, మైనింగ్ నిర్వహణలో అత్యుత్తమ విధానాలకు అవార్డు
- అవార్డును ప్రదానం చేసిన కేంద్ర మంత్రులు అమిత్ షా, ప్రహ్లాద్ జోషి
- అవార్డు అందుకున్న గోపాలకృష్ణ ద్వివేదీ,వెంకటరెడ్డి
ఖనిజాల అన్వేషణ, గనుల నిర్వహణలో ఆంధ్రప్రదేశ్ అత్యుత్తమ ప్రదర్శన కనబరచింది. ఈ మేరకు రాష్ట్ర గనుల శాఖకు జాతీయ స్థాయిలో అవార్డు దక్కింది. ఖనిజాల అన్వేషణ, వేలం, గనుల నిర్వహణలో అత్యుత్తమ విధానాలు అవలంబించిన రాష్ట్రాలకు దక్కే రాష్ట్రీయ ఖనిజ వికాస్ అవార్డుకు ఏపీ ఎంపికైంది. ఈ అవార్డు కింద కేంద్ర గనుల శాఖ ఏపీ గనుల శాఖకు రూ.2.4 కోట్ల నగదు పురస్కారాన్ని అందజేసింది.
ఈ మేరకు మంగళవారం ఢిల్లీలో జరిగిన జాతీయ స్థాయి సమావేశంలో కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా, కేంద్ర గనుల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషిలు ఏపీకి అవార్డు అందజేశారు. రాష్ట్రం తరఫున ఈ సమావేశానికి హాజరైన రాష్ట్ర గనుల శాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేదీ, డీఎంజీ వెంకటరెడ్డిలు కేంద్ర మంత్రుల నుంచి అవార్డును అందుకున్నారు.
.