అశోక స్తూపంపై ఉన్న మూడు సింహాలకు, పార్లమెంటు భవనంపై ఉన్న మూడు సింహాల గుర్తుకు పోలికే లేదు: జైరాం రమేశ్
- నూతన పార్లమెంటు భవనంపై మూడు సింహాల గుర్తు
- జాతీయ చిహ్నాన్ని ఆవిష్కరించిన మోదీ
- జాతీయ చిహ్నానికి దారుణ అవమానమన్న జైరాం రమేశ్
నూతన పార్లమెంటు భవనంపై జాతీయ చిహ్నమైన మూడు సింహాల గుర్తును ప్రధాని నరేంద్ర మోదీ ఆవిష్కరించిన సంగతి తెలిసిందే. అయితే, ఈ నూతన మూడు సింహాల చిహ్నం సారనాథ్ లోని అశోకస్తూపంపై ఉన్న మూడు సింహాల గుర్తుతో ఏ మాత్రం పోలిక లేకుండా ఉందని కాంగ్రెస్ నేత జైరాం రమేశ్ విమర్శించారు. సారనాథ్ లోని అశోకస్తూపంపై ఉన్న సింహాల స్ఫూర్తిని నూతన జాతీయ చిహ్నం కొంచెం కూడా ప్రతిబింబించేలా లేదని, పూర్తిగా విరుద్ధంగా ఉందని వ్యాఖ్యానించారు. జాతీయ చిహ్నానికి ఇది దారుణ అవమానం అని జైరాం రమేశ్ పేర్కొన్నారు.
లోక్ సభలో కాంగ్రెస్ ఫ్లోర్ లీడర్ అధిర్ రంజన్ చౌదరి కూడా దీనిపై విమర్శలు చేశారు. "నరేంద్ర మోదీ గారూ ఓసారి ఆ సింహం ముఖం చూడండి. సారనాథ్ లోని మహోన్నత స్తూపంపై ఉన్న సింహానికి ప్రతినిధిలా ఉందా? లేకపోతే గిర్ అడవుల్లో తిరిగే సింహం ముఖాన్ని వక్రీకరించినట్టు ఉందా?" అంటూ వ్యంగ్యం ప్రదర్శించారు.