జనాభాలో చైనాను దాటనున్న భారత్... ఇదీ ఒకందుకు మంచిదే అంటున్న ఐక్యరాజ్యసమితి అధికారి
- భారత్ లో ఇప్పుడు 142 కోట్ల జనాభా
- వచ్చే ఏడాది నాటికి చైనాను అధిగమించనున్న భారత్
- అత్యధిక జనాభా గల దేశంగా అవతరణ
- భద్రతామండలిలో చేరికకు ఈ అంశం ఉపయోగపడుతుందన్న అధికారి
ప్రస్తుతం దేశ జనాభా 142 కోట్లు కాగా, వచ్చే ఏడాది నాటికి భారత్ జనాభా విషయంలో చైనాను దాటిపోతుందని ఐక్యరాజ్యసమితి నివేదిక వెల్లడించడం తెలిసిందే. అయితే, ఈ జనాభా పెరుగుదల మంచిదేనని ఐక్యరాజ్యసమితికి చెందిన ఓ ఉన్నతాధికారి అభిప్రాయపడ్డారు. ఐక్యరాజ్యసమితి భద్రతామండలిలో శాశ్వత సభ్యత్వం కోసం ప్రయత్నిస్తున్న భారత్ కు ఆ పరిణామం ఎంతగానో లాభిస్తుందని వివరించారు.
"ప్రపంచంలో అత్యధిక జనాభా కలిగిన దేశానికి భద్రతామండలిలో స్థానం లభించడం సాధ్యమేనని అనుకుంటున్నాను. భద్రతామండలిలో స్థానం కోసం భారత్ తన వాదన వినిపించేందుకు జనాభా కూడా బలమైన అంశంగా నిలుస్తుంది. అతిపెద్ద దేశంగా ఉన్న తమను భద్రతామండలిలో ఎందుకు చేర్చుకోరని ప్రశ్నించేందుకు భారత్ కు వీలుచిక్కుతుంది" అని వివరించారు.