మరో నాలుగైదు రోజులు వర్షాలే... తెలంగాణ, కోస్తాంధ్రకు నేడు భారీ వర్ష సూచన

  • తెలుగు రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు
  • నేడు కోస్తాంధ్రలో అతి భారీ వర్షాలు
  • తెలంగాణలో కొన్నిచోట్ల అత్యంత భారీ వర్షాలు
తెలుగు రాష్ట్రాలపై వరుణుడి ప్రభావం కొనసాగుతోంది. తెలంగాణ, కోస్తాంధ్ర ప్రాంతాల్లో మరో నాలుగైదు రోజుల పాటు ఉరుములు, మెరుపులతో విస్తారంగా వర్షాలు కురుస్తాయని, కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు పడతాయని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) వెల్లడించింది. నేడు కోస్తాంధ్రలో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, తెలంగాణలో కొన్నిచోట్ల అత్యంత భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. ఈ మేరకు తాజా బులెటిన్ లో వివరించింది.

ఒడిశా, ఉత్తరాంధ్ర పరిసరాలను ఆనుకుని ఉన్న అల్పపీడనం తీవ్ర అల్పపీడనంగా బలపడిందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. దీనికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని వివరించింది. కాగా, తెలంగాణలో రెడ్ అలర్ట్ జాబితాను 13 జిల్లాలకు పెంచారు. మరో 9 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు.


More Telugu News