జమ్మూకశ్మీర్ లో ఇద్దరు టెర్రరిస్టులను మట్టుబెట్టిన భద్రతా బలగాలు
- పుల్వామా జిల్లాలో ఎన్ కౌంటర్
- అవంతిపొర వద్ద ఉగ్రవాద కదలికలు
- భారీగా మోహరించిన జవాన్లు
- కాల్పులు ప్రారంభించిన ఉగ్రవాదులు
- దీటుగా స్పందించిన జవాన్లు
జమ్మూకశ్మీర్ లో ఉగ్రవాదుల కోసం భద్రతా బలగాల వేట కొనసాగుతోంది. తాజాగా పుల్వామా జిల్లాలో జరిగిన ఎన్ కౌంటర్ లో ఇద్దరు టెర్రరిస్టులను సైన్యం హతమార్చింది.
అవంతిపొర ప్రాంతంలో ఉగ్రవాదుల కదలికలకు సంబంధించిన సమాచారంతో భారీగా భద్రతా బలగాలను తరలించారు. జవాన్లు గాలింపు చర్యలు చేపట్టగా, ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. దీటుగా స్పందించిన భద్రతా బలగాలు ఎదురుకాల్పులకు దిగాయి. ఈ కాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదులు మరణించగా, వారి నుంచి అమెరికా తయారీ తుపాకీ, ఒక పిస్టల్, మరికొన్ని ఆయుధాలు, మందుగుండు స్వాధీనం చేసుకున్నారు.
కాగా, మరణించిన వారిలో ఒకరిని కైజర్ కోకా అని గుర్తించారు. అతడు జైషే మహ్మద్ ఉగ్రవాద సంస్థకు చెందిన కరుడుగట్టిన ఉగ్రవాది అని పోలీసులు తెలిపారు. మరో ఉగ్రవాదిని గుర్తించాల్సి ఉంది.