పుంజుకోని రూపాయి.. కొత్త కనిష్ఠ స్థాయి నమోదు

  • డాలర్ తో 79.57కు చేరిక
  • 108.3కు డాలర్ ఇండెక్స్
  • రూపాయిపై విదేశీ ఇన్వెస్టర్లు, దిగుమతుల ప్రభావం
రూపాయి మరింత బలహీనతను ప్రదర్శిస్తోంది. అంతర్జాతీయ డాలర్ బలపడడం రూపాయి బలహీనతల్లో ఒకటి. దీనికితోడు పెరిగిన ముడి చమురు ధరల వల్ల భారత్ దిగుమతుల కోసం ఎక్కువ మొత్తంలో డాలర్లను వెచ్చించాల్సి వస్తోంది. అంతెందుకు.. బంగారం రూపంలోనే దిగుమతుల బిల్లు పెరిగిపోతోంది. వీటికితోడు విదేశీ పెట్టుబడిదారులు భారత ఈక్విటీ మార్కెట్ల నుంచి తమ పెట్టుబడులను క్రమంగా తరలించుకుపోతూనే ఉన్నారు.

రూపాయి పతనానికి ఇవన్నీ కారణమవుతున్నాయి. దీంతో ఫారెక్స్ మార్కెట్లో రూపాయి మంగళవారం చరిత్రలోనే అత్యంత కనిష్ఠ స్థాయి 79.57ను నమోదు చేసింది. డాలర్ ఇండెక్స్ 10.8.3కు పెరిగింది. 2002 అక్టోబర్ తర్వాత ఈ స్థాయిని నమోదు చేయడం ఇదే. యూరో బలహీనపడడం డాలర్ కు బలాన్నిచ్చింది. ప్రపంచవ్యాప్తంగా వృద్ధిపై నెలకొన్న ఆందోళనలు డాలర్లకు డిమాండ్ ను కల్పిస్తున్నాయి. రానున్న రోజుల్లో డాలర్ తో రూపాయి 82 స్థాయి వరకు క్షీణించి నిలదొక్కుకోవచ్చన్న విశ్లేషణలు వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి మూడు నెలల్లో వాణిజ్య లోటు 70 బిలియన్ డాలర్లుగా నమోదు కావడం గమనార్హం.


More Telugu News