ఓ వ్యక్తి బాధలకు చలించిపోయిన కేరళ విద్యాశాఖ మంత్రి బిందు... ఏం చేశారంటే...!

  • త్రిసూర్ ప్రాంతంలో మెడికల్ ఎయిడ్ కమిటీ సమావేశం
  • హాజరైన మంత్రి బిందు
  • కిడ్నీ వ్యాధిగ్రస్తుడి బాధ విని కరిగిపోయిన వైనం
  • బంగారు గాజు ఇచ్చి పెద్దమనసు చాటుకున్న మంత్రి
ఆర్. బిందు... కేరళ క్యాబినెట్ లో విద్యాశాఖ మంత్రిగా వ్యవహరిస్తున్నారు. ఆమె త్రిసూర్ లోని ఇరింజళకుడ వద్ద జరిగిన ఓ మెడికల్ ఎయిడ్ కమిటీ సమావేశానికి హాజరయ్యారు. ఈ సమావేశంలో వివేక్ ప్రభాకర్ అనే కిడ్నీ వ్యాధిగ్రస్తుడు కూడా పాల్గొన్నాడు. వివేక్ ప్రభాకర్ వయసు 27 సంవత్సరాలు. అతడికి వెంటనే కిడ్నీ మార్చాల్సి ఉంది. పేద కుటుంబానికి చెందిన వివేక్ ప్రభాకర్ దాతల కోసం చూస్తున్నాడు. 

అతడి దీనగాథను స్వయంగా విన్న మంత్రి ఆర్.బిందు చలించిపోయారు. అతడి కష్టాన్ని విని కరిగిపోయారు. వెంటనే తన చేతులకున్న బంగారు గాజుల్లో ఒకదాన్ని తీసి అతడికి ఇచ్చారు. దాంతో అక్కడున్న వారందరూ మంత్రి ఔదార్యానికి అచ్చెరువొందారు. ఆమెపై ప్రశంసల జల్లు కురిపించారు.


More Telugu News