భార్య కోసం వెతుకుతున్నానన్న నాగాలాండ్ మంత్రి... మీకోసం ఏదో ఒకటి చేస్తామన్న షాదీ డాట్ కామ్ వ్యవస్థాపకుడు
- నాగాలాండ్ మంత్రి సరదా వ్యాఖ్యలు
- నెటిజన్లను ఆకర్షిస్తున్న కామెంట్స్
- స్పందించిన షాదీ డాట్ కామ్ వ్యవస్థాపకుడు మిట్టల్
ప్రపంచ జనాభా దినోత్సవం సందర్భంగా నాగాలాండ్ ఉన్నత, సాంకేతిక విద్యాశాఖ మంత్రి టెమ్జెన్ ఇమ్నా చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. తనలా అందరూ బ్రహ్మచారుల్లా ఉంటే జనాభా పెరిగే పరిస్థితి ఉండదని మంత్రి టెమ్జెన్ ఇమ్రా సరదాగా వ్యాఖ్యానించారు.. బ్రహ్మచారుల ఉద్యమం కొనసాగిద్దాం రండి అంటూ ట్విట్టర్ వేదికగా ఆహ్వానం పలికారు.
దాంతో నెటిజన్లు ఈ మంత్రివర్యుల వివరాలను గూగుల్ లో వెదకడం మొదలుపెట్టారు. టెమ్జెన్ కు అసలు పెళ్లయిందా? కాలేదా? అంటూ టెమ్జెన్ వైఫ్ అని టైప్ చేసి వెదికారు. ఈ సెర్చ్ రిజల్ట్స్ ను స్క్రీన్ షాట్ తీసిన మంత్రి సోషల్ మీడియాలో పంచుకున్నారు. "మీరే కాదు, నేను కూడా నా భార్య కోసం వెతుకుతున్నాను" అంటూ చమత్కరించారు.
అయితే, మంత్రి వ్యాఖ్యలు ప్రముఖ మ్యాట్రిమొనీ సైట్ షాదీ డాట్ కామ్ వ్యవస్థాపకుడు అనుపమ్ మిట్టల్ దృష్టిలో పడ్డాయి. "మీరేమీ చింతించాల్సిన పనిలేదు... మీకోసం ఏదో ఒకటి చేస్తాం" అంటూ అనుపమ్ మిట్టల్ బదులిచ్చారు. అందుకు మంత్రి టెమ్జెన్ ఇమ్నా స్పందిస్తూ, "సోదరా ఇప్పుడు నా మనసు ప్రశాంతంగా ఉంది... ఇక సల్మాన్ భాయ్ కోసం ఎదురుచూస్తా" అంటూ మధ్యలోకి బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ ను కూడా లాగారు. సల్మాన్ ఇప్పటికీ అవివాహితుడిగానే ఉన్న సంగతి తెలిసిందే.