లోన్ యాప్‌ల వేధింపుల‌కు ఏపీలో యువ‌తి ఆత్మ‌హ‌త్య‌... సెల్ఫీ వీడియో విడుద‌ల చేసి ఉరేసుకున్న వైనం

  • లోన్ యాప్ ద్వారా రూ.20 వేలు రుణం తీసుకున్న ప్ర‌త్యూష‌
  • ఇప్ప‌టికే రూ.12 వేలు తిరిగి చెల్లించిన వైనం
  • మిగ‌తా మొత్తం చెల్లింపున‌కు సోమ‌వారం ఉద‌యం వ‌ర‌కు గ‌డువు విధించిన యాప్‌
  • గ‌డువులోగా చెల్లించ‌కుంటే త‌ప్పుడు ప్ర‌చారం చేస్తామ‌ని బెదిరింపు
  • మంగ‌ళ‌గిరి రూర‌ల్ పీఎస్‌లో కేసు న‌మోదు
లోన్ యాప్ వేధింపుల కార‌ణంగా ఏపీలో మ‌రో మ‌హిళ ఆత్మ‌హ‌త్య‌కు పాల్ప‌డింది. త‌న చావుకు లోన్ యాప్ వేధింపులే కార‌ణ‌మ‌ని స‌ద‌రు మ‌హిళ సెల్ఫీ వీడియో రికార్డ్ చేసిన త‌ర్వాత ఉరేసుకుని ఆత్మ‌హ‌త్య‌కు పాల్ప‌డింది. ఈ ఘ‌ట‌న‌పై మంగ‌ళ‌గిరి రూర‌ల్ పోలీస్ స్టేష‌న్‌లో కేసు న‌మోదైంది. మంగ‌ళ‌గిరి ప‌రిధిలోని చిన‌కాకానిలో ఈ ఘ‌ట‌న చోటుచేసుకుంది.

ఈ ఘ‌ట‌న వివ‌రాల్లోకెళితే... చిన‌కాకానికి చెందిన ప్ర‌త్యూష అనే యువ‌తి ఓ లోన్ యాప్ ద్వారా రూ.20 వేలు రుణంగా తీసుకుంది. అందులో ఇప్ప‌టికే ఆమె రూ.12 వేలు చెల్లించింది. అయితే మిగిలిన మొత్తాన్ని సోమ‌వారం ఉద‌యం 7 గంట‌ల‌లోగా చెల్లించాల‌ని లోన్ యాప్ సిబ్బంది ఆమెకు ఆదివారం రాత్రి గ‌డువు విధించారు. ఆ గ‌డువులోగా రుణం చెల్లించ‌కుంటే త‌ప్పుడు ప్ర‌చారం చేస్తామ‌ని కూడా బెదిరించారు. దీంతో మ‌న‌స్తాపానికి గురైన ఆమె త‌న‌కు జ‌రిగిన అన్యాయంపై సెల్ఫీ వీడియో రికార్డు చేసి ఆపై ఉరేసుకుని ఆత్మ‌హ‌త్య చేసుకుంది.


More Telugu News