రానా గారికి కాల్ చేసి ఒక మాట అడిగాను: సాయిపల్లవి
- విభిన్నమైన కథా చిత్రంగా 'గార్గి'
- ఎమోషన్ ప్రధానంగా నడిచే కథ
- ప్రధానమైన పాత్రను పోషించిన సాయిపల్లవి
- ఈ నెల 15వ తేదీన సినిమా విడుదల
సాయిపల్లవి ప్రధానమైన పాత్రగా 'గార్గి' సినిమా రూపొందింది. గౌతమ్ రామచంద్రన్ దర్శకత్వం వహించిన ఈ సినిమా తమిళంతో పాటు ఇతర భాషల్లోను ఈ నెల 15వ తేదీన విడుదల కానుంది. తండ్రీకూతుళ్ల ఎమోషన్స్ ప్రధానంగా నడిచే కథ ఇది. ఈ సినిమా తెలుగు వెర్షన్ ప్రమోషన్స్ లో సాయిపల్లవి పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ .. "చిన్నప్పుడు ఏదైనా మంచి పని చేస్తే అమ్మానాన్నలకు చూపించడానికి ఉత్సాహాన్ని చూపిస్తాము. అలా తమిళంలో చేసిన ఈ సినిమాను మీకు చూపించడానికి ఇక్కడికి వచ్చాను. తమిళంలో సూర్యగారు .. ఉదయనిధి స్టాలిన్ గారు ఈ సినిమాను చూశారు. ఇంతమంచి సినిమా మిగతా భాషల్లోని ఆడియన్స్ కి చేరాలనే ఉద్దేశంతో తమ ప్రెస్ మీట్స్ లో ఈ సినిమాను గురించి మాట్లాడారు.
అప్పుడు నేను రానా గారికి కాల్ చేసి ఈ సినిమాను తెలుగులో ప్రెజెంట్ చేస్తారా? అని అడిగాను. 'నువ్వు ఒక సినిమా చేశావంటేనే .. ఆ సినిమాలో విషయం ఉంటుందనే సంగతి నాకు తెలుసు. ఈ సినిమా పరంగా ఎలాంటి సపోర్ట్ కావాలన్నా చేస్తాను' అన్నారు. అందుకు ఆయనకి నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను" అంటూ చెప్పుకొచ్చింది.