గృహ నిర్మాణంపై సమీక్ష నిర్వహించిన జగన్
- జగనన్న కాలనీల నాణ్యతపై రాజీపడొద్దని జగన్ ఆదేశం
- డ్రెయిన్లు, మౌలిక సదుపాయాల కల్పనకు ప్రాధాన్యత నివ్వాలన్న సీఎం
- ఇళ్ల నిర్మాణ పనులను వేగవంతం చేయాలని ఆదేశం
గృహ నిర్మాణాలకు వనరుల విషయంలో దృష్టి సారించాలని, నాణ్యత విషయంలో రాజీపడొద్దని అధికారులకు ఏపీ ముఖ్యమంత్రి జగన్ ఆదేశాలు జారీ చేశారు. జగనన్న కాలనీల్లో ఇళ్ల నిర్మాణ పనుల ప్రగతిపై ఈరోజు ఆయన సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఇళ్ల నిర్మాణాలను వేగవంతం చేయాలని ఆదేశించారు.
జగనన్న కాలనీల్లో డ్రెయిన్లు, ఇతర మౌలిక సదుపాయాల కల్పనకు ప్రాధాన్యతను ఇవ్వాలని చెప్పారు. కరెంట్, నీటి సరఫరా అంశాలపై దృష్టి సారించాలని అన్నారు. ఇళ్లలో ఏర్పాటు చేసే ట్యూబ్ లైట్లు, బల్బులు, ఫ్యాన్లు నాణ్యంగా ఉండాలని ఆదేశించారు. ఈ సమావేశానికి మంత్రులు ధర్మాన ప్రసాదరావు, ఆదిమూలపు సురేశ్, జోగి రమేశ్, ఏపీఎస్హెచ్సీఎల్ ఛైర్మన్ దవులూరి దొరబాబు, చీఫ్ సెక్రటరీ సమీర్ శర్మ, పురపాలక, పట్టణాభివృద్ధి స్పెషల్ సీఎస్ శ్రీలక్ష్మి తదితర అధికారులు పాల్గొన్నారు.