జ‌ల‌పాతం కింద ప‌డ‌కుండానే ఆవిరిగా మారిపోతే!... అలాంటి ప్రకృతి సోయ‌గం వీడియో ఇదిగో!

  • పశ్చిమ క‌నుమ‌ల్లోని నానేఘాట్‌లో అరుదైన దృశ్యం
  • జ‌ల ధార మ‌ధ్య‌లోనే ఆవిరిగా మారిపోతూ పైకి వెళుతున్న వైనం  
  • వీడియోను పంచుకున్న‌ ఐఎఫ్ఎస్ అధికారి సుశాంత్ నంద
ప్ర‌కృతిలో ఎన్నెన్నో అందాలు క‌నిపిస్తుంటాయి. వాటిలో క‌మ‌నీయ దృశ్యాలు మ‌రెన్నో. అలాంటి ఓ దృశ్యాన్ని ఇండియ‌న్ ఫారెస్ట్ సర్వీస్ (ఐఎఫ్ఎస్‌)కు చెందిన అధికారి సుశాంత నంద సోష‌ల్ మీడియా వేదిక‌గా పంచుకున్నారు. ఈ వీడియోలో కొండ‌పై నుంచి జాలువారే జ‌ల‌పాతం భూమిని త‌గ‌ల‌కుండానే... మ‌ధ్య‌లోనే ఆవిరిగా మారిపోతున్న వైనం ప్ర‌కృతి ప్రేమికుల‌ను క‌ట్టిప‌డేస్తోంది.

ప‌శ్చిమ క‌నుమ‌ల్లోని నానేఘాట్ ప్రాంతంలో క‌నిపించిన ఈ దృశ్యంలో కొండ పై నుంచి కింద‌కు జారుతున్న జ‌ల ధార అలా మ‌ధ్య‌లోనే ఆవిరిగా మారిపోతూ పైకి వెళుతోంది. వాయువేగం అన్నది భూమి గురుత్వాక‌ర్ష‌ణ‌ శక్తికి స‌రిస‌మానంగా కానీ, వ్యతిరేకంగా కానీ ఉన్న‌ప్పుడు ఇలాంటి దృశ్యాలు క‌నిపిస్తాయ‌ని సుశాంత నంద వెల్ల‌డించారు.


More Telugu News