సమస్యలపై జనసేన సమరభేరి... జనవాణి అర్జీల పరిశీలన ప్రక్రియను సమీక్షించిన నాదెండ్ల
- నిన్న విజయవాడలో రెండో విడత జనవాణి
- భారీగా తరలివచ్చిన ప్రజలు
- పవన్ కల్యాణ్ కు అర్జీల అందజేత
- అర్జీలను పరిశీలించనున్న జనసేన పార్టీ ప్రత్యేక బృందం
జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ విజయవాడలో నిన్న రెండో విడత జనవాణి కార్యక్రమం చేపట్టిన సంగతి తెలిసిందే. ఈసారి కూడా ప్రజలు వినతిపత్రాలతో భారీగా తరలివచ్చారు. కాగా, జనవాణి-జనసేన భరోసా కార్యక్రమంలో ఇప్పటివరకు రెండు విడతల్లో అందిన అర్జీలను పరిశీలించే కార్యక్రమాన్ని పార్టీ పొలిటికల్ అఫైర్స్ కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ నేడు షురూ చేశారు.
ఈ అర్జీలను పరిశీలించి, వాటిలోని సమస్యల ఆధారంగా సంబంధిత ప్రభుత్వ శాఖలకు లేఖలు రాయనున్నారు. ఈ ప్రక్రియను నాదెండ్ల నేడు సమీక్షించారు. రిటైర్డ్ ఐఏఎస్ అధికారి, జనసేన నేత డి.వరప్రసాద్ నేతృత్వంలో ఈ అర్జీలను శాఖల వారీగా విభజించి, ఆయా శాఖల ముఖ్య కార్యదర్శులకు అర్జీదారుల సమస్యలు తెలియజేస్తారు.
దీనికోసం జనసేన పార్టీ అధినాయకత్వం ప్రత్యేక బృందాన్ని నియమించింది. ప్రతి అర్జీని ఈ బృందం పరిశీలించి, సమస్య పరిష్కారానికి కృషి చేస్తుంది. పార్టీ చీఫ్ పవన్ కల్యాణ్ కూడా ప్రతి సమస్యను సమీక్షించి, స్వయంగా సంబంధిత శాఖలకు లేఖలు రాస్తారు.