కేసీఆర్ ను ఫామ్ హౌజ్ నుంచి బయటికి ఈడ్చుకొచ్చాం.. ఆయన భయం, బలహీనతలు నాకు తెలుసు: ఈటల
- కేసీఆర్ ఏ పథకం తెచ్చినా ఆయన బంధువులకే లబ్ధి అన్న ఈటల
- ఆయనకు కావాల్సింది బానిసలు మాత్రమేనని విమర్శ
- ప్రశ్నించినందుకే తనను బయటికి పంపారని ఆరోపణ
- కేసీఆర్ ను ఓడిస్తేనే తెలంగాణకు పట్టిన పీడ విరగడ అవుతుందని వ్యాఖ్య
తెలంగాణలో సీఎం కేసీఆర్ ఏ పథకం తెచ్చినా ఆయన బంధువులకే మేలు కలిగేలా ఉంటుందని.. సంక్షేమ పథకాల ద్వారా ప్రజలకు మేలు చేయాలన్న ఆలోచన కేసీఆర్ కు లేదని బీజేపీ నేత, హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్ బలం, బలహీనతలు, బలహీనతలు అన్నీ తెలిసిన వ్యక్తిని తాను అని.. కేసీఆర్ కు కావాల్సింది బానిసలు మాత్రమేనని ఈటల పేర్కొన్నారు. ఒక ఉద్యమకారుడిగా ప్రశ్నించినందుకే తనను పార్టీ నుంచి బయటికి పంపారని ఆరోపించారు. కేసీఆర్ దుర్మార్గ పాలన అంతమొందించే బాధ్యత తనపై ఉందన్నారు.
గజ్వేల్ ప్రజలు సిద్ధంగా ఉన్నారు..
కేసీఆర్ మతి భ్రమించి మాట్లాడుతున్నారని ఈటల మండిపడ్డారు. ‘‘ఎప్పుడూ నా రాజకీయ జీవితంలో పరుష పదజాలాలు వాడలేదు. అలాంటి నాపై కేసీఆర్ చిల్లరగా మాట్లాడారు. నాకు సహనం, సంస్కారం, ఓపిక ఉన్నాయి. డబ్బుతో గెలవొచ్చనే భ్రమలో కేసీఆర్ ఉన్నారు. హుజూరాబాద్ లో ఓటుకు నోట్లు పంచారు. నన్ను ఓడించేందుకు తీవ్రంగా ప్రయత్నించారు. కేసీఆర్‌ను ఓడిస్తేనే తెలంగాణకు పట్టిన పీడ విరగడ అవుతుంది. ఇప్పటికే ఫాంహౌస్ లో పడుకున్న సీఎం కేసీఆర్ ను ప్రగతి భవన్ కు ఈడ్చుకొచ్చాం..” అని ఈటల పేర్కొన్నారు. కేసీఆర్ కు తాను విసిరిన చాలెంజ్ కు కట్టుబడి ఉన్నానని చెప్పారు. గజ్వేల్ లో పోటీ చేస్తానని.. అక్కడి ప్రజలు కేసీఆర్ ను ఓడించేందుకు సిద్ధంగా ఉన్నారని చెప్పారు.