గుజరాత్ లోని ఓ పల్లెలో ఐపీఎల్ పేరిట నకిలీ మ్యాచ్ లు.. రష్యా పుంటర్లకు గాలం
- కొంత భూమిని లీజుకు తీసుకున్న ఈవెంట్ నిర్వాహకుడు
- అందులో లైట్లు ఏర్పాటు చేసి ఆటల నిర్వహణ
- అదుపులోకి తీసుకున్న పోలీసులు
అది నిజమైన ఐపీఎల్ మాదిరే ఉన్నా.. ఐపీఎల్ కాదు. గుజరాత్ లోని మెహ్సాన జిల్లా మోలిపూర్ అనే గ్రామంలో నడుస్తున్న ఈ క్రికెట్.. రష్యాలోని పుంటర్లకు గాలం వేస్తోంది. వ్యవసాయ కూలీలే క్రికెట్ ఆటగాళ్లుగా మారిపోయారు. కామెంటేటరీ, అధికారిక యూట్యూబ్ చానల్ కూడా నిర్వహిస్తోంది. రష్యాలో ఉన్న పుంటర్లు (పందెం కాసేవాళ్లు) గెలుపు ఓటములపై పందేలు కాస్తుంటారు.
ఈ నకిలీ ఐపీఎల్ ఇప్పటికే క్వార్టర్ ఫైనల్ కు చేరుకోవడం ఆశ్చర్యకరం. పోలీసులు వీరిని అదుపులోకి తీసుకున్నారు. రష్యాలోని త్వెర్, వోరోనెజ్, మాస్కో తదితర ప్రాంతాల నుంచి పుంటర్లు బెట్టింగ్ లు వేసుకుంటున్నారు. ఐపీఎల్ అనే పేరుతో ఏర్పాటు చేసిన యూట్యూబ్ చానల్ లో ప్రసారం చేస్తున్నారు.
ఒక మ్యాచ్ లో ఆటగాడిగా నటించినందుకు వ్యవసాయ కూలీకి ఇచ్చే మొత్తం రూ.400. బొమ్మ వాకీ టాకీలతో అంపైర్లు కూడా ఉండడం ఈ ఆట హైలైట్ గా చెప్పుకోవచ్చు. చెన్నై సూపర్ కింగ్స్, ముంబై ఇండియన్స్, గుజరాత్ టైటాన్స్ జెర్సీల్లో వారు దర్శనమిస్తుంటారు. 5 హెచ్ డీ కెమెరాలతో మ్యాచ్ ను రికార్డు చేసి యూట్యూబ్ లో ప్రసారం చేస్తుంటారు. మీరట్ కు చెందిన ఓ వ్యక్తి.. హర్ష భోగ్లే స్వరాన్ని ఇమిటేట్ చేస్తూ కామెంటరీ చేయడం హైలైట్. ఈ ఉదంతంలో పోలీసులు ఇప్పటి వరకు నలుగురిని అరెస్ట్ చేయగా, మిగిలిన వారి కోసం అన్వేషణ మొదలు పెట్టారు.
నకిలీ ఐపీఎల్ నిర్వహణకు కీలక సూత్రధారిగా ఉన్న షోయబ్ దవ్దా ఎనిమిది నెలల పాటు రష్యా పబ్ లో పనిచేయడం అతడికి కలిసొచ్చింది. సదరు పబ్ బెట్టింగ్ లకు కేంద్రం.