ధరల పెరుగుదలకు నిరసనగా పరమశివుడి వేషంలో వీధినాటకం.. అరెస్ట్
- ధరల పెరుగుదలను నిరసిస్తూ వీధి నాటకం
- హిందువుల మనోభావాలు దెబ్బతీశాడంటూ ఫిర్యాదు
- అరెస్ట్ చేసిన పోలీసులు.. సీఎం జోక్యంతో విడుదల
ద్రవ్యోల్బణం, ధరల పెరుగుదలకు నిరసనగా పరమశివుడి వేషం వేసుకుని వీధినాటకంతో నిరసన తెలిపిన వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. హిందువుల మనోభావాలను దెబ్బతీశాడంటూ విశ్వహిందూ పరిషత్, బజరంగ్ దళ్ సంస్థల ఫిర్యాదుతో పోలీసులు అతడిని అరెస్ట్ చేసి కటకటాల వెనక్కి పంపారు. అసోంలోని నాగావ్‌లో జరిగిందీ ఘటన.
ధరల పెరుగుదలను నిరసిస్తూ బిరించి బోరా అనే వ్యక్తి శివుడి వేషం ధరించి పార్వతి వేషధారితో కలిసి వీధినాటకం వేశాడు. దీనిని తీవ్రంగా పరిగణించిన వీహెచ్‌పీ, బజరంగ్ దళ్.. హిందువుల మనోభావాలను దెబ్బతీశారంటూ వారిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో బిరించి బోరాను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బోరాను అరెస్ట్ చేయడంపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. దీంతో జోక్యం చేసుకున్న ముఖ్యమంత్రి హిమంతబిశ్వ శర్మ ఆదేశాల మేరకు బిరించిన పోలీసులు విడుదల చేశారు.