నెల రోజులపాటు 100 బొద్దింకల్ని పెంచితే.. రూ.1.58 లక్షలు.. ఓ కంపెనీ ఆఫర్!
- వాటికి ఆహారం పెట్టాలి.. వారు ఇచ్చిన పురుగు మందులు చల్లాలి
- బొద్దింకలను సమర్థవంతంగా నియంత్రించే పరిశోధన కోసం ఆఫర్ పెట్టిన అమెరికా కంపెనీ
- పెంచేందుకు ముందుకొచ్చిన రెండున్నర వేల మంది
కోళ్లు పెంచుతారు.. మేకలు పెంచుతారు.. కావాలంటే ఇంట్లో పెంపుడు జంతువుల్లా పిల్లులు, కుక్కలు పెంచుకుంటారు. మరీ కొందరైతే ఉడతలు, ఎలుకలు పెంచుకునేవాళ్లూ ఉన్నారు. కానీ బొద్దింకలను పెంచాల్సి వస్తే.. చాలా మంది యాక్ అంటూ వికారం వచ్చినట్టు చేస్తారు. మరికొందరు భయంతో ఎగిరి అంతదూరం దూకుతారు. కానీ అమెరికాలో మాత్రం 2,500 మంది బొద్దింకలను పెంచేందుకు రెడీ అయ్యారు. అదేంటి అంటారా.. ఉత్తిగా ఏమీ కాదు లెండి. బాగా డబ్బులిస్తే పెంచుతున్నారు. అదేమిటో తెలుసా..?
పెస్ట్ కంట్రోల్ కోసం పెంచేందుకు..
అమెరికాలోని నార్త్ కరోలినా ప్రాంతానికి చెందిన హైబ్రిడ్ పెస్ట్ కంట్రోల్/మీడియా కంపెనీ ‘ద పెస్ట్ ఇన్ఫార్మర్’ ఇటీవల ఓ సంచలన ప్రకటన చేసింది. వంద అమెరికన్ బొద్దింకలను 30 రోజుల పాటు ఇంట్లో ఉంచి జాగ్రత్తగా చూసుకుంటే.. ఏకంగా 2 వేల డాలర్లు ఇస్తామని ప్రకటించింది. అంటే మన కరెన్సీలో దాదాపు రూ.1.58 లక్షలు అన్నమాట.
ఇదంతా ఎందుకు అంటే..
బొద్దింకలను సమర్థవంతంగా నియంత్రించడం ఎలా? వాటిపై ఎలాంటి పురుగు మందులు బాగా పనిచేస్తాయన్నది తేల్చడానికట. బొద్దింకలను పెంచేవారు వాటికి ఆహారం వేయడంతోపాటు తాము ఇచ్చిన మందులను వాడాలని కంపెనీ సూచించింది. ఇదేదో బాగుందని ఇప్పటివరకు రెండున్నర వేల మందికిపైగా దరఖాస్తు చేసుకున్నారు. అంత మందికి కాదుగానీ.. కొన్ని ఇళ్లను ఎంపిక చేసి బొద్దింకలను ఇచ్చేందుకు కంపెనీ రెడీ అయింది.