రోనిన్... రెట్రో లుక్ తో టీవీఎస్ కొత్త బైక్
- రెట్రో సెగ్మెంట్లో నయా మోడల్
- అందుబాటు ధరలో రోనిన్
- ప్రారంభ ధర రూ.1.49 లక్షలు
- ఆకట్టుకునేలా డిజైన్
రాయల్ ఎన్ ఫీల్డ్, జావా, యెజ్డీ వంటి రెట్రో బైక్ లకు ఇప్పటికీ ప్రజాదరణ తగ్గలేదు. ఈ మోటార్ సైకిళ్లు పెద్దగా మైలేజీ ఇవ్వకపోయినా, వాటిపై ఠీవిగా కూర్చుని ప్రయాణం చేయాలని చాలామంది కోరుకుంటారు. ఈ రెట్రో బైక్ లు రోడ్డుపై వెళుతుంటే అందరి దృష్టిని ఆకర్షిస్తాయనడంలో అతిశయోక్తి లేదు.
తాజాగా రెట్రో సెగ్మెంట్లోకి దేశీయ ద్విచక్రవాహన తయారీ దిగ్గజం టీవీఎస్ కూడా అడుగుపెట్టింది. రోనిన్ పేరుతో టీవీఎస్ కొత్త మోటార్ సైకిల్ ను తీసుకువచ్చింది. ఇది కొంచెం క్రూయిజర్ బైక్ లాగా అనిపిస్తుంది. అయితే సింగిల్ ఇన్ స్ట్రుమెంట్ పోడ్, హెవీ ఆయిల్ ట్యాంక్, వైడ్ హ్యాండిల్ బార్ రెట్రో లుక్ అందిస్తున్నాయి.
ఈ సెగ్మెంట్లో ఇతర బైక్ లతో పోల్చితే రోనిన్ చాలా తేలికైనది. దీని బరువు 160 కేజీలు. దీని ధర కూడా అందుబాటులోనే ఉందని చెప్పుకోవచ్చు. టీవీఎస్ రోనిన్ ప్రారంభ ధర రూ.1.49 లక్షలు (ఎక్స్ షోరూం) కాగా, గరిష్ఠ ధర రూ.1.70 లక్షలు. ఇందులో 225 సీసీ సింగిల్ సిలిండర్ ఫోర్ వాల్వ్ ఇంజిన్ అమర్చారు. ఇది ఫైవ్ స్పీడ్ గేర్ బాక్స్, డ్యూయల్ చానల్ ఏబీఎస్ (అర్బన్, రెయిన్) కలిగి ఉంటుంది. రోనిన్ ట్యాంక్ కెపాసిటీ 14 లీటర్లు.
టీవీఎస్ స్మార్ట్ ఎక్స్ కనెక్ట్ ద్వారా బ్లూటూత్ సౌకర్యం లభిస్తుంది. ఇన్ కమింగ్ కాల్ అలెర్ట్స్, ఎస్సెమ్మెస్ అలెర్ట్స్, వాయిస్ కమాండ్ సిస్టమ్ దీంట్లో పొందుపరిచారు. రెట్రో సెగ్మెంట్లో ఇది రాయల్ ఎన్ ఫీల్డ్ క్లాసిక్ 350, హోండా హైనెస్, హోండా సీబీ350ఆర్ఎస్, జావా 42లకు పోటీ ఇస్తుందని భావిస్తున్నారు. ఆయా బైక్ లతో పోల్చితే రోనిన్ ధర తక్కువగా ఉండడం, డిజైన్ కూడా ఆకర్షణీయంగా ఉండడంతో యువత దీనిపై ఆసక్తి చూపే అవకాశాలు ఉన్నాయి.