భద్రాచలం, జోగులాంబ.. అంటూ ప్రధాని మోదీ దండం పెట్టి వెళ్లిపోయారు.. కేసీఆర్ విమర్శలు
- జాతీయ కార్యవర్గ భేటీ, సికింద్రాబాద్ సభలో మోదీ ప్రసంగాన్ని ఎద్దేవా చేసిన సీఎం
- వర్షాలపై అప్రమత్తం చేస్తూ పెట్టిన ప్రెస్ మీట్ లో వ్యాఖ్యలు
- హైదరాబాద్ సభలో మోదీ ఏమో చెబుతారనుకుంటే.. ఏమీ లేదని విమర్శ
ఇటీవల ప్రధాని నరేంద్ర మోదీ హైదరాబాద్ కు వచ్చినప్పుడు, సికింద్రాబాద్ బీజేపీ బహిరంగ సభలో ఏమేమో చెబుతారని అనుకున్నామని.. కానీ ఏమీ లేదని తెలంగాణ సీఎం కేసీఆర్ విమర్శించారు. ప్రెస్ మీట్ ప్రారంభం కాగానే కొందరు దేవతల పేర్లు చెప్పి.. ఇంకేం ప్రెస్ మీట్ అయిపోయిందంటూ నవ్వుతూ వ్యాఖ్యానించారు. సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ లో ప్రధాని మోదీ చేసిన ప్రసంగం ఇలాగే ఉందని ఎద్దేవా చేశారు.
‘‘కొమురవెల్లి మల్లన్న, కొండగట్టు అంజన్న, వేములవాడ రాజన్న, ఏడుపాయల దుర్గమ్మ, చెరువుగట్టు లింగన్న, సమ్మక్క సారలమ్మ, మన్నెంకొండ కురుమూర్తి.. ఇంకేం ప్రెస్ మీట్ అయిపోయింది. సరిపోతుంది కదా.. ఎందుకంటే ఇది ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ స్టయిల్. హైదరాబాద్ సభలో ఆయన ఏమో చెబుతారు అనుకుంటే.. భద్రాచలం, జోగులాంబ, ఆ అంబ.. అంటూ ఏవో పేర్లు చెప్పి దండం పెట్టి వెళ్లారు. అంతే.. ” అని కేసీఆర్ పేర్కొన్నారు. ప్రధాని మోదీ చెప్పింది ఇంకేముందని వ్యాఖ్యానించారు.