ఉపాసన నిర్ణయాన్ని కొనియాడిన సద్గురు జగ్గీ వాసుదేవ్

  • 2012లో పెళ్లితో ఒక్కటైన రామ్ చరణ్, ఉపాసన
  • ఇప్పటికీ పిల్లలు లేని వైనం
  • పలుసార్లు స్పష్టత ఇచ్చిన ఉపాసన
  • అవార్డు ఇస్తానన్న సద్గురు
టాలీవుడ్ అగ్రహీరో రామ్ చరణ్, ఉపాసన 2012 జూన్ 14న పెళ్లి చేసుకోగా, ఈ దంపతులకు ఇంకా సంతానం కలగలేదు. దీనిపై పలు కథనాలు ప్రచారంలో ఉన్నాయి. ఇదొక చర్చనీయాంశంగానూ మారింది. ఇది తమ వ్యక్తిగత నిర్ణయం అని ఉపాసన పలుమార్లు స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో ఉపాసనపై ప్రముఖ ఆధునిక ఆధ్యాత్మిక గురు సద్గురు జగ్గీ వాసుదేవ్ ప్రశంసల జల్లు కురిపించారు. 

ఇటీవల ఉపాసన ఓ కార్యక్రమంలో సద్గురుతో పలు అంశాలపై ముచ్చటించారు. సంతానం విషయంలో ప్రజలు నన్ను ఎందుకు ప్రశ్నిస్తుంటారు? అని ఆమె సద్గురు ఎదుట ఆవేదన వ్యక్తం చేశారు. అందుకు సద్గురు స్పందిస్తూ, పిల్లలు కనకూడదని వ్యక్తిగతంగా నిర్ణయం తీసుకున్నందుకు ఆమెను అభినందించారు. ఓ అవార్డు కూడా ఇస్తానని అన్నారు. 

"ఇప్పుడు నువ్వు చేస్తున్నది మహోన్నత సేవ. నువ్వు గనుక ఒక ఆడ పులివి అయ్యుంటే, పిల్లల్ని కను అని చెప్పేవాడ్ని. ఎందుకంటే పులిజాతి అంతరించిపోయే ప్రమాదంలో ఉంది గనుక. కానీ మనం మానవులం.... అంతరించిపోయే జాతి కాదు. చాలామంది ఉన్నాం. పిల్లల్ని కనకపోతే ఏమవుతుందన్న బాధలేదు" అంటూ సద్గురు తన అభిప్రాయాలను పంచుకున్నారు.


More Telugu News