షాంఘైలో 3,800 టన్నుల ఇంటిని కదిలించి చూపించారు..!

  • 100 ఏళ్ల చరిత్ర ఉన్న కట్టడానికి పునరుద్ధరణ పనులు
  • సాంకేతికత సాయంతో పూర్తిగా తరలింపు
  • తిరిగి అదే స్థానంలో కూర్చోబెట్టిన నిపుణులు
భవనాలను లిఫ్ట్ సాయంతో పైకి లేపి కదిలించే టెక్నాలజీ గురించి  కొన్ని సందర్బాల్లో విన్నాం. ఈ విషయంలో చైనా మరింత ఆధునికంగా వ్యవహరించింది. పురాతమైన, బరువైన కట్టడాన్ని పునరుద్ధరణ పనుల కోసం సునాయాసంగా తరలించి తన నైపుణ్యాలను చాటుకుంది. చైనా ఆర్థిక రాజధాని షాంఘైలో ఇది చోటు చేసుకుంది. 

ఈ భవనానికి వందేళ్లకు పైగా చరిత్ర ఉంది. బరువు 3,800 టన్నులు. టెక్నాలజీ సాయంతో పూర్తిగా పైకి ఎత్తి వేరే చోటుకు తరలించారు. తిరిగి జూలై 8న యథా స్థానంలో ఇంటిని సెట్ చేశారు. పునరుద్ధరణ కార్యక్రమంలో భాగంగా ఇలా చేయాల్సి వచ్చింది. అది పెద్ద, బలమైన నిర్మాణాన్ని తరలించడం షాంఘైలో ఇదే మొదటిసారి. ‘3,800 టన్నుల వందేళ్లనాటి భవనం నిదానంగా కదులుతోంది’అంటూ చైనా ప్రభుత్వ అధికారి జాంగ్ మీఫాంగ్ దీని గురించి ట్వీట్ చేశారు. షాంఘైలో 2020లోనూ 85 ఏళ్లనాటి భవనాన్ని ఇలానే తరలించారు. మన దేశంలో ఇంత భారీ, పురాతన కట్టడాన్ని తరలించిన దాఖలాల్లేవు.


More Telugu News