భద్రతా సిబ్బంది ఇలా చేసి ఉంటే షింజో అబే ప్రాణాలు దక్కేవి: ఆనంద్ మహీంద్రా
- మొదటి బుల్లెట్ మిస్సయినా అప్రమత్తం కాని సిబ్బంది
- తక్షణమే అబేను కవర్ చేసి ఉంటే ప్రాణాపాయం తప్పేదన్న మహీంద్ర
- ఘటనకు సంబంధించిన వీడియోను షేర్ చేసిన ఆనంద్ మహీంద్ర
జపాన్ మాజీ ప్రధాని షింజో అబే హత్య వెనుక భద్రతా వైఫల్యం ఉందన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. భారత ప్రముఖ పారిశ్రామిక వేత్త ఆనంద్ మహీంద్ర కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఘటనకు సంబంధించిన వీడియోను ట్విట్టర్ లో షేర్ చేసిన ఆయన.. భద్రతా వైఫల్యం గురించి ప్రస్తావించారు.
పార్లమెంటు ఎగువ సభ ఎన్నికలకు సంబంధించిన ప్రచార కార్యక్రమంలో షింజో అబే మాట్లాడుతుండగా, వెనుకగా వచ్చిన దుండగుడు ఆయనపై కాల్పులు జరిపాడు. రెండు బుల్లెట్లు తగలడంతో అబే అక్కడే కుప్పకూలారు. ఆసుపత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ ఆయన మృతి చెందారు.
వాస్తవానికి దుండగుడు కాల్పిన మొదటి బుల్లెట్ మిస్సయింది. అప్పటికే భారీ శబ్దం వినిపించగా.. ప్రసంగం ఆపిన అబే వెనక్కి తిరిగి చూశారు. ఈ లోపు దుండగుడు కాల్చిన మరో రెండు బుల్లెట్లు ఆయనకు తాకాయి. అయితే, మొదటి బుల్లెట్ మిస్సయినప్పుడే భద్రతా సిబ్బంది షింజోపైకి దూకి ఆయనకు రక్షణ కవచంలా నిలిస్తే అబే ప్రాణాలు కాపాడేవారని ఆనంద్ మహీంద్ర అభిప్రాయపడ్డారు. కానీ, భద్రతా సిబ్బంది అలా చేయకుండా దుండగుడిని పట్టుకునేందుకు ప్రయత్నించి తప్పు చేశారని పేర్కొన్నారు.