తగ్గని కరోనా ఉద్ధృతి.. వరుసగా రెండో రోజూ 18 వేల కరోనా కేసులు
- 24 గంటల్లో 18, 257 కొత్త కేసులు
- మొన్నటి కంటే స్వల్పంగా తగ్గుదల
- వైరస్ తో 42 మంది మృతి
దేశంలో కరోనా వైరస్ పంజా విసురుతూనే ఉంది. వరుసగా రెండో రోజూ 18 వేల పైచిలుకు కొత్త కేసులు నమోదయ్యాయి. గడచిన 24 గంటల్లో కొత్తగా 18,257 కేసులు నమోదయ్యాయని కేంద్ర ఆరోగ్య శాఖ శనివారం ప్రకటించింది. శనివారంతో పోలిస్తే (18, 840) కాస్త తగ్గాయని తెలిపింది. ప్రస్తుతం దేశంలో 1,28, 690 యాక్టివ్ కేసులున్నాయి.
రోజువారీ పాజిటివిటీ రేటు 4.22 శాతంగా నమోదైంది. దేశంలో ఇప్పటిదాకా నమోదైన పాజిటివ్ కేసుల సంఖ్య 43, 622, 651కి చేరుకుంది. వైరస్ వల్ల తాజాగా 42 మంది మృతి చెందారు. దాంతో, దేశంలో కరోనా మరణాల సంఖ్య 5,25,428కి చేరుకుంది.
దేశ రాజధాని ఢిల్లీలో కొత్తగా 544 కరోనా కేసులు నమోదయ్యాయి. ఇద్దరు చనిపోయారు. ఢిల్లీలో పాజిటివిటి రేటు 3.37 శాతంగా ఉంది. మహారాష్ట్రలో 2,760 కొత్త కేసులు రాగా, ఐదుగురు మృతి చెందారు. పశ్చిమ బెంగాల్ లో 2,968 మంది పాజిటివ్ గా తేలగా.. గత 24 గంటల్లో వైరస్ వల్ల ముగ్గురు చనిపోయారు.