వచ్చే మూడ్రోజులు హైదరాబాద్ లో భారీ వర్షాలు

  • నిన్న రాత్రి హైదరాబాదులో భారీ వర్షం
  • ఇవాళ రాత్రి కూడా కురిసే అవకాశం
  • అప్రమత్తమైన జీహెచ్ఎంసీ
గత కొన్నిరోజులుగా హైదరాబాదు నగరంలో వర్షాలు కురుస్తున్నాయి. నైరుతి రుతుపవనాలు, ఉపరితల ద్రోణి, వాయవ్య పశ్చిమ మధ్య బంగాళాఖాతం తీరంలో ఆవర్తనం ప్రభావంతో భారీ వర్షపాతం నమోదవుతోంది. కాగా, వాతావరణ కేంద్రం హైదరాబాదు నగరానికి మరోసారి వర్ష సూచన చేసింది. వచ్చే మూడ్రోజుల పాటు హైదరాబాదులో భారీ వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. 

కాగా, ఇవాళ రాత్రి కూడా హైదరాబాదులో భారీ వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం పేర్కొనడంతో, జీహెచ్ఎంసీ అధికారులు అప్రమత్తం అయ్యారు. గత రాత్రి కురిసిన భారీ వర్షంతో హైదరాబాదు నగరం అతలాకుతలమైంది. డ్రైనేజీలు, నాలాలు ఉప్పొంగుతున్నాయి. లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. భారీ వర్షాల నేపథ్యంలో రోడ్లపై మ్యాన్ హోల్స్ పట్ల ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.


More Telugu News