అశ్విన్ నే పక్కనబెట్టారు... కోహ్లీ వంతు కూడా వస్తుంది: కపిల్ దేవ్

అశ్విన్ నే పక్కనబెట్టారు... కోహ్లీ వంతు కూడా వస్తుంది: కపిల్ దేవ్
  • వరుసగా విఫలమవుతున్న కోహ్లీ
  • కోహ్లీపై తీవ్ర విమర్శలు
  • కోహ్లీని కొనసాగించడంపై కపిల్ దేవ్ స్పందన
ఇటీవల కాలంలో వరుసగా విఫలమవుతున్నప్పటికీ టీమిండియాలో విరాట్ కోహ్లీని కొనసాగిస్తుండడంపై క్రికెట్ దిగ్గజం కపిల్ దేవ్ స్పందించారు. రవిచంద్రన్ అశ్విన్ టెస్టుల్లో వరల్డ్ నెంబర్ 2 అని, అంతటివాడినే పక్కనబెట్టారని, త్వరలోనే కోహ్లీకి కూడా ఆ పరిస్థితి ఎదురవుతుందని అన్నారు. అశ్విన్ వంటి మేటి బౌలర్ నే తప్పించినప్పుడు, కోహ్లీని ఎందుకు పక్కనబెట్టరని పేర్కొన్నారు. ఇన్నాళ్లుగా మనం చూసిన కోహ్లీ వేరని, ఇప్పుడు ఆడుతున్న కోహ్లీ వేరని కపిల్ దేవ్ అభిప్రాయపడ్డారు. 

ఆటతీరుతోనే ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న కోహ్లీ ఇప్పుడు సరిగా ఆడడంలేదని, కానీ యువ ఆటగాళ్లను పక్కనబెడుతున్నారని కపిల్ దేవ్ విమర్శించారు. అయితే యువ ఆటగాళ్లు తమకు అవకాశం వచ్చినప్పుడు రాణించి, ఇలాంటి స్టార్ ఆటగాళ్లకు సవాల్ విసరాలని పిలుపునిచ్చారు. ప్రస్తుతం టీ20 క్రికెట్ తీరుతెన్నులు చూస్తుంటే కోహ్లీ ఇదే ఆటతీరుతో ఎక్కువ కాలం కొనసాగలేడని, అతడిని కూడా జట్టు నుంచి తప్పించే పరిస్థితి కనిపిస్తోందని తెలిపారు.


More Telugu News