'ఇస్మార్ట్ శంకర్' వంటి సినిమా పూరి వల్లనే అవుతుంది : రామ్
- 'ది వారియర్' ప్రమోషన్స్ లో రామ్
- పోలీస్ పాత్రలంటే ఇష్టమని చెప్పిన హీరో
- ఆ యూనిఫామ్ లోనే పవర్ ఉంటుందంటూ వ్యాఖ్య
- ఈ కథలో కొత్త పాయింట్ ఉందంటూ వివరణ
రామ్ హీరోగా లింగుసామి రూపొందించిన 'ది వారియర్' ఈ నెల 14వ తేదీన థియేటర్లకు రానుంది. దాంతో ఈ సినిమా ప్రమోషన్స్ ఊపందుకున్నాయి. తాజా ఇంటర్వ్యూలో రామ్ మాట్లాడుతూ .. "ఈ సినిమాలో నేను పోలీస్ ఆఫీసర్ గా కనిపిస్తాను. ఆ పాత్రలో మరింత ఎనర్జీ చూపించాలని నేను అనుకోలేదు.
పోలీస్ యూనిఫామ్ లోనే ఒక పవర్ ఉంటుంది. ఆ పవర్ వలన అలా అనిపించి ఉండొచ్చు. గతంలో పోలీస్ నేపథ్యంలో కథలు చాలానే వచ్చాయి. నాక్కూడా పోలీస్ పాత్రను చేయాలని చాలా రోజులుగా ఉంది. కానీ కొత్త పాయింట్ ఉన్నప్పుడు చేస్తే బాగుంటుందని ఆగాను. అలాంటి ఒక పాయింట్ ఈ సినిమాలో ఉంది.
'ఇస్మార్ట్ శంకర్' వంటి ఒక సినిమా నా కెరియర్లో పడటం నా అదృష్టం. నేను లేకపోతే ఆ సినిమా లేదని పూరి గారు అనడం ఆయన సంస్కారం. కానీ ఆ సినిమాను పూరిగారు మాత్రమే తీయగలరు అనేది నా అభిప్రాయం. ఆ సినిమా మాదిరిగానే ఈ సినిమాను కూడా ఆదరిస్తారనే నమ్మకం నాకు ఉంది" అంటూ చెప్పుకొచ్చాడు.