వైసీపీ జీవితకాల అధ్యక్షుడిగా జగన్ ఎన్నిక
- ప్లీనరీ సమావేశాల్లో తీర్మానం చేసి ఆమోదించిన వైసీపీ
- జీవితకాల అధ్యక్షుడిగా ఎన్నుకున్నందుకు కృతజ్ఞతలు తెలిపిన జగన్
- ప్లీనరీలో ఆత్మీయుల సునామీ కనిపిస్తోందని వ్యాఖ్య
వైసీపీ జీవితకాల అధ్యక్షుడిగా ముఖ్యమంత్రి జగన్ ఎన్నికయ్యారు. ప్లీనరీ సమావేశాల్లో ఈ మేరకు తీర్మానం చేసి ఆమోదించారు. ఈ తీర్మానంతో పాటు పారదర్శక పాలన-సామాజిక సాధికారత, పరిశ్రమలు-ఎంఎస్ఎంఈలు, వ్యవసాయం తదితర అంశాలపై తీర్మానాలపై కూడా చర్చించి వాటిని ఆమోదించారు. ఈ తీర్మానాలను ఆమోదించిన తర్వాత పార్టీ అధినేత జగన్ ముగింపు ప్రసంగాన్ని ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తనను జీవితకాల అధ్యక్షుడిగా ఎన్నుకున్నందుకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ ప్లీనరీలో ఆత్మీయుల సునామీ కనిపిస్తోందని చెప్పారు. దశాబ్ద కాలం పాటు కష్టాలను భరించి, అవమానాలను తట్టుకుని, త్యాగాలు చేసిన సైన్యం ఇక్కడ ఉందని అన్నారు. తన కష్టంతో పాటు మీ త్యాగాలు, శ్రమ వల్లే ఈ ప్రభుత్వం ఏర్పడిందని చెప్పారు. పార్టీ భావాలు, బాధ్యతలను భుజాలపై మోస్తున్న నాయకులు, అభిమానులు, కార్యకర్తలకు శాల్యూట్ చేస్తున్నానని అన్నారు.