మణిరత్నం కోసం రంగంలోకి కమల్!
- మణిరత్నం తాజా చిత్రంగా రూపొందిన 'పొన్నియన్ సెల్వన్'
- రాజ రాజ చోళ నేపథ్యంలో నడిచే కథ
- తమిళ వెర్షన్ కి కమల్ వాయిస్ ఓవర్
- సెప్టెంబర్ 30వ తేదీన విడుదల
కమల్ 'విక్రమ్' సినిమాతో మరోసారి తన విశ్వరూపం చూపించారు. హీరోగానే కాకుండా నిర్మాతగా కూడా ఈ సినిమా ఆయన కెరియర్లో చెప్పుకోదగినదిగా నిలిచింది. అలాంటి కమల్ 'పొన్నియన్ సెల్వన్' కి వాయిస్ ఇవ్వడానికి రెడీ అవుతున్నారట. మణిరత్నం దర్శకత్వంలో .. లైకా నిర్మాణంలో ఈ సినిమా భారీ బడ్జెట్ తో నిర్మితమైంది.
తమిళంతో పాటు తెలుగు .. కన్నడ .. మలయాళ .. హిందీ భాషల్లో ఈ సినిమాను సెప్టెంబర్ 30వ తేదీన విడుదల చేయనున్నారు. ఈ సినిమాకి అనేక విశేషాలు జోడిస్తూ ఉండటంతో, అంతకంతకూ అంచనాలు పెరుగుతున్నాయి. ఈ సినిమాలో అక్కడక్కడా సన్నివేశాలను కలుపుతూ వాయిస్ ఓవర్ ఉంటుందట.
ప్రతి భాష నుంచి ఒక స్టార్ ను ఎంచుకుని ఆ వాయిస్ ఓవర్ ను చెప్పించాలనే నిర్ణయానికి వచ్చిన మణిరత్నం, తమిళంలో కమల్ చెబితే బాగుటుందని భావించినట్టుగా సమాచారం. 'నాయకన్' నుంచి కమల్ .. మణిరత్నం మధ్య మంచి అనుబంధం ఉంది. అందువలన మణిరత్నం అడిగిన వెంటనే కమల్ ఓకే చెప్పారని అంటున్నారు.